టీఆర్ఎస్‌పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్‌పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్‌గా మారింది. పలువురు నాయకులు దీనిపై స్పందిస్తూ కేసీఆర్‌ను తప్పుపడుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే మంత్రులుగా కేసీఆర్, మహ్మద్ అలీ నియమితులయ్యారు. మిగిలిన మంత్రివర్గ ఏర్పాటు మొన్నటివరకూ జరగలేదు. అయితే తాజాగా తొలి మంత్రివర్గ విస్తరణలో భాగంగా పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అందులో హరీశ్ రావు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఆధారంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. […]

Vijay K

|

Feb 21, 2019 | 4:50 PM

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్‌గా మారింది. పలువురు నాయకులు దీనిపై స్పందిస్తూ కేసీఆర్‌ను తప్పుపడుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే మంత్రులుగా కేసీఆర్, మహ్మద్ అలీ నియమితులయ్యారు. మిగిలిన మంత్రివర్గ ఏర్పాటు మొన్నటివరకూ జరగలేదు.

అయితే తాజాగా తొలి మంత్రివర్గ విస్తరణలో భాగంగా పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అందులో హరీశ్ రావు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఆధారంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.

తొలిత రేవంత్ రెడ్డి స్పందిస్తూ హరీశ్ రావును కావాలనే కేసీఆర్ పక్కన పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కూడా ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించారు. నమ్మిన వారిని తడి గుడ్డతో గొంతు కోయడం టీఆర్ఎస్ నాయకత్వ నైజమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది మరోసారి రుజువైందన్నారు. టీఆర్ఎస్‌లో రెండో స్ధానంలో ఉన్న వారి పరిస్ధితి ఎప్పటికీ ఇంతేనని ఆమె అన్నారు. కాలం మారినా టీఆర్ఎస్ నాయకత్వ వైఖరి మారలేదు. మొన్న ఆలె నరేంద్ర, నిన్న నేను, నేడు తన్నీరు హరీష్ రావు అంటూ మండిపడ్డారు.

దొరల వారసత్వ పాలన తీరు కూడా నాడు, నేడు, రేపు అన్నట్టుగానే ఉంటుందని విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గతంలో విజయశాంతి టీఆర్ఎస్ పార్టీలో పని చేశారు. తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

అయితే మంత్రివర్గ విస్తరణలో హరీశ్ రావును తీసుకోకపోవడంపై మంత్రి హరీశ్ రావు కూడా స్పందించారు. తమ నాయకుడు కేసీఆర్ ఏది ఆదేశిస్తే అదే చేస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ఉంటానని తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu