లిమ్కా బుక్‌ రికార్డు సాధించిన ప్యారడైజ్‌‌ బిర్యానీ

లిమ్కా బుక్‌ రికార్డు సాధించిన ప్యారడైజ్‌‌ బిర్యానీ

హైదరాబాద్‌: హైదరాబాద్ బిర్యానీకి వరల్డ్ వైడ్ ఫేమ్ ఉంది. అందులో ప్యారడైజ్ బిర్యానీ అంటే లొట్టలేయని వారు ఉండరు. ప్రైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌గా పేరొందిన ప్యారడైజ్‌‌ బిర్యానీ మరో అరుదైన ఘనత సాధించింది. ఒక ఏడాదిలో అత్యధిక వినియోగదారులకు బిర్యానీ సేవలు అందించినందుకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించింది. ఒక ఏడాదిలోనే దాదాపు 70 లక్షల మందికిపైగా బిర్యానీ రుచిని అందించినందుకు ‘ప్యారడైజ్‌’ ఈ అవార్డును సొంతం చేసుకుంది. లిమ్కా బుక్‌ అవార్డుతో పాటు బెస్ట్‌ బిర్యానీ అవార్డు లభించాయి. ప్యారడైజ్‌‌ […]

Ram Naramaneni

|

Feb 21, 2019 | 5:17 PM

హైదరాబాద్‌: హైదరాబాద్ బిర్యానీకి వరల్డ్ వైడ్ ఫేమ్ ఉంది. అందులో ప్యారడైజ్ బిర్యానీ అంటే లొట్టలేయని వారు ఉండరు. ప్రైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌గా పేరొందిన ప్యారడైజ్‌‌ బిర్యానీ మరో అరుదైన ఘనత సాధించింది. ఒక ఏడాదిలో అత్యధిక వినియోగదారులకు బిర్యానీ సేవలు అందించినందుకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించింది. ఒక ఏడాదిలోనే దాదాపు 70 లక్షల మందికిపైగా బిర్యానీ రుచిని అందించినందుకు ‘ప్యారడైజ్‌’ ఈ అవార్డును సొంతం చేసుకుంది. లిమ్కా బుక్‌ అవార్డుతో పాటు బెస్ట్‌ బిర్యానీ అవార్డు లభించాయి. ప్యారడైజ్‌‌ ఛైర్మన్‌ అలీ హేమతికి ఆసియా ఫుడ్‌ కాంగ్రెస్‌ సంస్థ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌‌ హోటల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సిబ్బంది కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకొన్నారు.

లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించడం చాలా ఆనందంగా ఉందని.. ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని సంస్థ ఛైర్మన్‌ అలీ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37 ప్యారడైజ్‌ బ్రాంచ్‌లు ఉన్నాయని.. త్వరలోనే ఇతర దేశాల్లోనూ ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. నాణ్యత, వినియోగదారుల నమ్మకంతో పాటు సంస్థలో పని చేసే ప్రతి ఒక్కరి కృషి వలనే ఈ ఘనత సాధ్యమైందని ప్యారడైజ్‌ సీఈవో గౌతమ్‌ గుప్తా అన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu