పదో శతాబ్దంలో ఆమెను సమాధి చేసిన తీరు ఆశ్చర్యం

గడిచిన కాలంలో ఎందరో వీరులు, వీర నారీమణిలు ఉన్నారు. గగుర్పొడిచే పోరాటాలు చేస్తూ, ధైర్యంగా కదం తొక్కిన వారున్నారు. అందులో చాలామందిని వారి వీరత్వానికి గుర్తుగా అదే తరహాలో ఘనంగా సమాధి చేసిన సందర్భాలు మనకు నేటికీ కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. స్వీడన్‌లో అలాంటిదే ఒకటి వెలుగు చూసింది. ఒకరిని సమాధి చేస్తూ వారితో పాటుగా పలు ఆయుధాలు, రెండు గుర్రాలను కూడా సమాధి చేశారు. 1878లో జరిపిన తవ్వకాల్లో మొదటిగా ఇది బయటపడింది. అయితే బయటపడినప్పటి నుంచీ […]

పదో శతాబ్దంలో ఆమెను సమాధి చేసిన తీరు ఆశ్చర్యం
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:00 PM

గడిచిన కాలంలో ఎందరో వీరులు, వీర నారీమణిలు ఉన్నారు. గగుర్పొడిచే పోరాటాలు చేస్తూ, ధైర్యంగా కదం తొక్కిన వారున్నారు. అందులో చాలామందిని వారి వీరత్వానికి గుర్తుగా అదే తరహాలో ఘనంగా సమాధి చేసిన సందర్భాలు మనకు నేటికీ కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి.

స్వీడన్‌లో అలాంటిదే ఒకటి వెలుగు చూసింది. ఒకరిని సమాధి చేస్తూ వారితో పాటుగా పలు ఆయుధాలు, రెండు గుర్రాలను కూడా సమాధి చేశారు. 1878లో జరిపిన తవ్వకాల్లో మొదటిగా ఇది బయటపడింది. అయితే బయటపడినప్పటి నుంచీ అది ఒక పురుషుని ఆస్థిపంజరంగానే పరిగణించారు.

కానీ 2017లో ఆ భావన తప్పని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆ ఆస్థిపంజరం ఒక మహిళదని, ఆమె వీర నారి అని తెలిపారు. తాజాగా ఆ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించి ధృవీకరించడం జరిగింది. ఆ ఆస్థిపంజరం ఎముకలను పరీక్షించగా అందులో రెండు ఎక్స్ క్రోమోజోమ్‌లు మాత్రమే ఉన్నాయని, వై క్రోమోజోమ్ లేదని తేలిందట.

దీంతో పదో శతాబ్ధంలో కూడా మహిళలు ఎంతటి పోరాట పటిమతో ఉండేవారో తెలియజేస్తుందంటూ పురావస్తు శాస్త్రవేత్తలు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ఆమెను సమాధి చేసినప్పుడు ఆమెతో పాటు ఉంచిన ఆయుధాలు చాలా భయానకమైనవిగా ఉన్నాయి. రెండు గుర్రాల ఆస్థిపంజరాల ఆకారాలు కూడా భారీగా ఉన్నాయి.

దీంతో పాటు ఒక లెటర్ కూడా సమాధిలో దొరికింది. అందులో ఉన్న సమాచారం మేరకు ఈ వీర నారి పథక రచన చేయడం, వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట అని అర్ధమౌతోంది. ఒక అత్యున్నత స్థాయి పోరాట యోధురాలుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.