కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలోని నయానగర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో సమస్యలున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.