మోదీసర్కారుపై విరుచుకుపడ్డ నామా

టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు కేంద్రంపై విరుచుకుపడ్డారు. ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదంతో పార్లమెంట్ లో మాట్లాడ్డం ప్రారంభించిన నామా.. రైతులు, సైనికులు బావుంటేనే దేశం బావుంటుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతాంగం రోడ్డెక్కిందని, అందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులే కారణమని అన్నారు. రాజ్యసభలో ఓటింగ్ పెడితే బిల్లు వీగిపోతుందన్న భయంతో మూజువాణి ఓటు ద్వారా బిల్లులు పాస్ చేసి ప్రజాస్వామ్యం గొంతు నొక్కారని నామా మండిపడ్డారు. రైతుల బిల్లులపై […]

  • Venkata Narayana
  • Publish Date - 9:24 pm, Sun, 20 September 20
మోదీసర్కారుపై విరుచుకుపడ్డ నామా

టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు కేంద్రంపై విరుచుకుపడ్డారు. ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదంతో పార్లమెంట్ లో మాట్లాడ్డం ప్రారంభించిన నామా.. రైతులు, సైనికులు బావుంటేనే దేశం బావుంటుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతాంగం రోడ్డెక్కిందని, అందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులే కారణమని అన్నారు. రాజ్యసభలో ఓటింగ్ పెడితే బిల్లు వీగిపోతుందన్న భయంతో మూజువాణి ఓటు ద్వారా బిల్లులు పాస్ చేసి ప్రజాస్వామ్యం గొంతు నొక్కారని నామా మండిపడ్డారు. రైతుల బిల్లులపై అన్ని పార్టీలను ఎందుకు ఏకం చేయలేకపోయారని అధికారపక్షాన్ని ఆయన ఆక్షేపించారు. కనీసం బిల్లును సెలెక్ట్ కమిటీకైనా పంపొచ్చని, లేదంటే రైతులను పిలిచి సమావేశం పెట్టొచ్చని, కానీ ఇదేదీ చేయకుండా ఎందుకింత తొందర అని ఆయన ప్రశ్నించారు. ఇది కచ్చితంగా రైతులకు ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుందని నామా అన్నారు. బిల్లు ఆమోద సమయంలో కొద్ది సేపు సభ ప్రసారాలను నిలిపివేశారని, కొద్ది సేపు శబ్దం బయటకు వినిపించకుండా మ్యూట్ చేశారని విమర్శించారు. అధికారపక్షం చేసిన అన్యాయానికి భవిష్యత్తులో రైతులు తగిన గుణపాఠం చెబుతారని నామా నాగేశ్వరరావు హెచ్చరించారు.