3వేల కోట్లతో తితిదే వార్షిక బడ్జెట్‌

3వేల కోట్లతో తితిదే వార్షిక బడ్జెట్‌

తిరుపతి: తిరుమల, తిరుపతి దేవస్థానం 2019-20 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.3 వేల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను  రూపొందించింది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మంగళవారం  అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో బడ్జెట్‌పై చర్చించి ఆమోదం తెలపనున్నారు. మండలి ఆర్థిక ఉప సంఘం సభ్యులైన నూతలపాటి శ్రీకృష్ణ, పొట్లూరి రమేష్‌బాబు, అశోక్‌రెడ్డి ఇప్పటికే సమావేశమై దేవస్థానం పరంగా ప్రాధాన్యతలను గుర్తించి బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాజధాని అమరావతిలో శ్రీవారి దివ్యక్షేత్రం నిర్మాణం, […]

Ram Naramaneni

|

Feb 18, 2019 | 5:17 PM

తిరుపతి:

తిరుమల, తిరుపతి దేవస్థానం 2019-20 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.3 వేల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను  రూపొందించింది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మంగళవారం  అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో బడ్జెట్‌పై చర్చించి ఆమోదం తెలపనున్నారు. మండలి ఆర్థిక ఉప సంఘం సభ్యులైన నూతలపాటి శ్రీకృష్ణ, పొట్లూరి రమేష్‌బాబు, అశోక్‌రెడ్డి ఇప్పటికే సమావేశమై దేవస్థానం పరంగా ప్రాధాన్యతలను గుర్తించి బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాజధాని అమరావతిలో శ్రీవారి దివ్యక్షేత్రం నిర్మాణం, అలిపిరిలో భారీ వసతి సముదాయం నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలను దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్‌ పరంగా భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. స్థానికుల సమస్యల పరిష్కారం దిశగా బడ్జెట్‌లో కేటాయింపులు జరగనున్నాయి. వచ్చే నెలతో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరానికి గతేడాది రూ.2,893 కోట్లతో తితిదే వార్షిక ప్రణాళిక ప్రవేశపెట్టింది. అప్పట్లో ధర్మకర్తల మండలి లేకపోవడంతో దేవస్థానం యాజమాన్యం చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈసారి మండలి ఉండడంతో కసరత్తు అనంతరం ఆమోదముద్ర వేయనుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా మరో ఇద్దరికి అవకాశం లభించింది. నెల్లూరుకు చెందిన వేనాటి రామచంద్రారెడ్డి, కడప జిల్లాకు చెందిన సుగవాసి ప్రసాద్‌బాబులను సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. కాగా ఇటీవలే పాలకమండలిలో సభ్యునిగా నియమించిన తెలంగాణ  ఎమ్యెల్యే సండ్ర వెంకట వీరయ్య భాద్యతలు స్వీకరించని కారణంగా అతని సభ్యత్వాన్ని తొలగించిన సంగతి తెలిసిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu