రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికన్నా చాలా తక్కువ సీట్లు మాత్రమే దక్కించుకుని కంగుబాటుకు గురైంది. పలువురు ప్రముఖ నాయకులు సైతం ఓడిపోయి నీరసించారు. అందులో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఒకరు. కొడంగల్‌ నియోజకవర్గంలో ఓటమి పాలైన తర్వాత రేవంత్ రెడ్డి కొంతకాలం మీడియాకు దూరంగా ఉంటానని చెప్పి అందరికీ షాకిచ్చారు. అయితే ఆయన తాజాగా తొలిసారి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటు జరిగినప్పటికీ చాలా కాలంగా టీఆర్ఎస్ బాస్ […]

రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 6:36 PM

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికన్నా చాలా తక్కువ సీట్లు మాత్రమే దక్కించుకుని కంగుబాటుకు గురైంది. పలువురు ప్రముఖ నాయకులు సైతం ఓడిపోయి నీరసించారు. అందులో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఒకరు. కొడంగల్‌ నియోజకవర్గంలో ఓటమి పాలైన తర్వాత రేవంత్ రెడ్డి కొంతకాలం మీడియాకు దూరంగా ఉంటానని చెప్పి అందరికీ షాకిచ్చారు. అయితే ఆయన తాజాగా తొలిసారి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ ఏర్పాటు జరిగినప్పటికీ చాలా కాలంగా టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మంత్రివర్గ విస్తరణపై ఏమీ చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో పలు విమర్శలొచ్చాయి. అయితే తాజాగా క్యాబినెట్ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తొలివిడతలో 9 మంది పేర్లు దాదాపుగా ఖరారైనట్టే.

అయితే ఇక్కడ అసలు విషయమేమంటే ఈ తొమ్మిది మందిలో హరీశ్ రావు పేరు లేదు. దీంతో దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ కేసీఆర్ కావాలనే హరీశ్‌ను మంత్రివర్గంలో చేర్చుకోలేదని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో హరీశ్ రావు ఫోన్‌లో మాట్లాడారని, ఆ మాటలను హరీశ్ రావు పీఏ స్వయంగా కేసీఆర్‌కు ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. అది విన్న తర్వాతనే కేసీఆర్ హరీశ్ రావుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు రేవంత్ రెడ్డి.