
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఓ వైపు పాక్ సైన్యం జరుపుతున్న కాల్పులను ఎదుర్కొంటూ.. మరోవైపు లోయలో ఉగ్రవాదులను కూడా ఏరిపారేస్తున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం బారాముల్లా జిల్లాలోని రాంపూర్ సెక్టార్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందడందో ఆర్మీ జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో రాంపూర్ సెక్టార్‌లోని
సరిహద్దు ప్రాంతంలో హత్‌లంగా వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో చైనీస్ వెపన్స్‌తో పాటు.. ఇతర ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. పట్టుబడ్డ వాటిలో 5 చైనీస్ పిస్టల్స్‌తో పాటు మ్యాగజైన్లు, 24 గ్రైనేడ్లు, ఓ ఏకే-47 తో పాటు
మ్యాగజైన్.. ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Last evening a search operation was launched along LoC in Hathlanga, Rampur Sector, Baramulla dist. During operation weapon cache was discovered. Recoveries include 1 AK 47 with magazines, 5 Chinese pistols with magazines, 24 grenades & other warlike stores: Chinar Corps, Army pic.twitter.com/1YlQnRsws0
— ANI (@ANI) July 23, 2020