లధాఖ్‌పై చైనా విమానాల చక్కర్లు.. పరిస్థితి ఉద్రిక్తం
భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చైనా కవ్వింపు చర్యలతో సరిహద్దులోని లే, లద్ధాఖ్ ప్రాంతాల్లో భారత సైన్యం అలర్ట్‌గా ఉంది. తాజాగా లద్ధాఖ్‌లో చైనా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. దాంతో భారత సైన్యం అప్రమత్తమైంది.
భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చైనా కవ్వింపు చర్యలతో సరిహద్దులోని లే, లద్ధాఖ్ ప్రాంతాల్లో భారత సైన్యం అలర్ట్‌గా ఉంది. తాజాగా లద్ధాఖ్‌లో చైనా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. దాంతో భారత సైన్యం అప్రమత్తమైంది. ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తున్నారు. రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారని కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రకటించింది. అటు భారత ఆర్మీ చీఫ్ గురువారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి తాజా పరిస్థితిని విశదపరిచారు.
జూన్ 15వ తేదీన భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఆనాటి ఘర్షణలో తమ సైనికులు కూడా మరణించారని చైనా ప్రకటించింది. కానీ ఎలాంటి ఆధారాలను విడుదల చేయలేదు. ఈ ఘటన తర్వాత రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తరచూ చైనా కవ్వింపు చర్యలకు దిగుతుండటంతో ఇటు భారత్ కూడా అప్రమత్తంగా ఉంది. ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు సరిహద్దులో దురాక్రమణకు ప్రయత్నిస్తోంది చైనా. దీంతో ఏ క్షణంలో ఏమి జరిగినా ధీటుగా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉంది భారత్. లద్ధాఖ్ ప్రాంతానికి భారీగా యుద్ద వాహనాలను, ఆయుధాలను పంపించింది భారత ఆర్మీ.