స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకున్న అరకు వ్యాపారులు
. రీ ఓపెన్ 1 పేరుతో మళ్లి ఆర్థిక కార్యకలాపాలు షురూ అయ్యాయి. కానీ, మరోసారి కరోనా వ్యాప్తి మరింత కొనసాగుతూనే ఉంది. అయితే, మరోసారి జనమే స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించించుకుంటున్నారు. తాజాగా విశాఖ మన్యంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అరకులో గురువారం నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు.

కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా దాదాపు రెండు నెలలపాటు లాక్ డౌన్ విధించినప్పటికీ కొవిడ్ పాజిటివ్ కేసులకు కట్టడి పడలేదు. రీ ఓపెన్ 1 పేరుతో మళ్లి ఆర్థిక కార్యకలాపాలు షురూ అయ్యాయి. కానీ, మరోసారి కరోనా వ్యాప్తి మరింత కొనసాగుతూనే ఉంది. అయితే, మరోసారి జనమే స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు. తాజాగా విశాఖ మన్యంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అరకులో గురువారం నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. తమ ప్రాణాలను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని స్థానిక పౌర సంక్షేమ సంఘం తీర్మానం చేసింది. వీరికి స్థానిక అధికారుల సైతం ఓకే చెప్పేశారు. దీంతో గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సుంకరమెట్ట, అరకులోయ, యండపల్లివలస, అరకుల్లో వర్తకులు దుకాణాలను మూసివేశారు. స్థానికంగా నిర్వహించే సంతలను రద్దు చేశామంటూ మైదాన ప్రాంత వర్తకులకు సమాచారాన్ని అందించారు. హోటళ్లను మూసివేసినప్పటికీ పార్శిల్ సర్వీసులు చేసుకునేందుకు మాత్రం అనుమతినిచ్చారు. ఇక అరుకు ప్రాంతానికి వచ్చే పర్యాటకులను పరీక్షించి గాని వదలడంలేదు. చిలకలగెడ్డ వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేసి థర్మల్ స్ర్కీనింగ్ యంత్రాలు తనిఖీలు చేస్తున్నారు.




