తెలంగాణలో ఒక్క రోజే 920 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. (జూన్ 26) గురువారం ఒక్కరోజే 920 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి...

తెలంగాణలో ఒక్క రోజే 920 పాజిటివ్‌ కేసులు
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 26, 2020 | 1:45 AM

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. (జూన్ 26) గురువారం ఒక్కరోజే 920 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,364కి చేరింది. ఇప్పటివరకు ఒక్కరోజే ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 4,688 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 6,446 మంది చికిత్స పొందుతున్నారు. నేడు కరోనా రక్కసికి ఐదుగురు మృత్యువాత పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 230కు చేరింది. ఇక తాజాగా నమోదైన కేసుల్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 737 పాజిటివ్ కేసులు ఉండటంతో ఆందోళన మొదలైంది.