క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
దేశం కరోనా ధాటికి విలవిలలాడుతోంది. ప్రతి రోజు కొత్తగా నమోదవుతున్న కేసులతో జనం బెంబెలేత్తుతున్నారు. గురువారం కొత్తగా గుజరాత్‌లో 577, పశ్చిమబెంగాల్‌లో 470, హర్యానాలో 453 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశం కరోనా ధాటికి విలవిలలాడుతోంది. ప్రతి రోజు కొత్తగా నమోదవుతున్న కేసులతో జనం బెంబెలేత్తుతున్నారు. గురువారం కొత్తగా గుజరాత్‌లో 577, పశ్చిమబెంగాల్‌లో 470, హర్యానాలో 453 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గుజరాత్‌లో ఇవాళ 577 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29,578కి చేరిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక కరోనా బారినపడి ఇప్పటివరకు 1,754 మంది ప్రాణాలను కోల్పోయారు. కాగా, కరోనా నుంచి 21,506 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
ఇక. పశ్చిమబెంగాల్‌లో ఇవాళ 470 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు అధికారులు. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 15,648కి చేరింది. గురువారం ఒక్కరోజే 15 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 606కు చేరింది. మొత్తం కేసులలో 4,852 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మరో 10,190 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.
అటు హర్యానాలో కొత్తగా నమోదైన 453 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం 12,463 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకూ 7,380 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతానికి కరోనాను జయించలేక 198 మంది ప్రాణాలొదిలినట్లు ఆ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.