నీట్ ఫలితాల్లో టాప్‌లో తెలంగాణ విద్యార్థిని

దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ఫలితాలను బుధవారం సిబీఎస్ఈ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన నళిన్‌ ఖండేల్‌వాల్‌ జాతీయ స్థాయిలో ప్రధమ ర్యాంకు సాధించగా.. తెలంగాణకు చెందిన జి.మాధురీ రెడ్డి బాలికల్లో టాపర్‌గా నిలిచింది. 695 మార్కులు పొందిన ఆమెకు జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకు లభించింది. అయితే ఢిల్లీకి చెందిన భవిక్ బన్సాల్, యూపీకి చెందిన అక్షిత్‌ కౌశిక్‌ అనే ఇద్దరు విద్యార్థులకూ సమానంగా 700 మార్కులు […]

నీట్ ఫలితాల్లో టాప్‌లో తెలంగాణ విద్యార్థిని
Follow us

|

Updated on: Jun 06, 2019 | 10:43 AM

దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ఫలితాలను బుధవారం సిబీఎస్ఈ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన నళిన్‌ ఖండేల్‌వాల్‌ జాతీయ స్థాయిలో ప్రధమ ర్యాంకు సాధించగా.. తెలంగాణకు చెందిన జి.మాధురీ రెడ్డి బాలికల్లో టాపర్‌గా నిలిచింది. 695 మార్కులు పొందిన ఆమెకు జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకు లభించింది. అయితే ఢిల్లీకి చెందిన భవిక్ బన్సాల్, యూపీకి చెందిన అక్షిత్‌ కౌశిక్‌ అనే ఇద్దరు విద్యార్థులకూ సమానంగా 700 మార్కులు వచ్చాయి. భవిక్‌ బన్సాల్‌కు అక్షిత్‌ కౌశిక్‌ కన్నా జీవశాస్త్రంలో ఎక్కువ మార్కులు రావడంతో ద్వితీయ ర్యాంకును కేటాయించారు. ఇక అక్షిత్‌ కౌశిక్‌ తృతీయ ర్యాంకును పొందారు. దివ్యాంగుల అభ్యర్థుల్లో రాజస్థాన్‌కు చెందిన భెరారామ్‌ 604 మార్కులతో టాపర్‌గా నిలిచారు.

కాగా, ఈ ఏడాది నీట్‌కు 14,10,755 మంది హాజరుకాగా వారిలో 7,97,042 మంది అర్హత సాధించారు. మొత్తం 15,19,375 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ 1,08,015 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఇందులో ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు పరీక్షరాయగా, వారిలో ముగ్గురు అర్హత సాధించారు.