కొత్త సచివాలయ నిర్మాణానికి ‘సుప్రీం‘ ఓకే

తెలంగాణ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తున్న వారికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సచివాలయం కూల్చివేత, కొత్త భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారికి అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అప్‌హోల్డ్ చేసింది.

  • Rajesh Sharma
  • Publish Date - 1:47 pm, Wed, 28 October 20
కొత్త సచివాలయ నిర్మాణానికి ‘సుప్రీం‘ ఓకే

Supremecourt okays new secretariat construction: తెలంగాణ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తున్న వారికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సచివాలయం కూల్చివేత, కొత్త భవన నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. దీంతో కొత్త సచివాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది.

పలు కారణాల వల్ల హైదరాబాద్ ట్యాంక్ బండ్ పక్కన వున్న తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చి వేసి.. భవ్యమైన సచివాలయ భవనాన్ని నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. అయితే, ఈ ప్రతిపాదన తెరమీదికి వచ్చినప్పట్నించి పలువురు దాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. గతంలో హైదరాబాద్ హైకోర్టు పాత సచివాలయం కూల్చివేత, కొత్త భవన నిర్మాణానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో లేవనెత్తిన అంశాలకు హైకోర్టు తీర్పు అడ్డురాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Also read: ఇళ్ళను ఆక్రమించుకుంటాం… టీడీపీ నేతల హెచ్చరిక