ప్రాజెక్ట్ ‘పులస’

పులస చాలా రుచికరంగా ఉంటుంది. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అంటారు. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీనిని వాళ్ళు ‘హిల్సా’ అని పిలుస్తారు. నాలుగు కిలోల బరువున్న పులస(హిల్సా) చేపను ఓ వ్యక్తి రూ.22,000కు కొనుగోలు చేశాడు. 2016 జూన్‌లో పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో జరిగిందీ ఘటన. బంగాళాఖాతం నుంచి మయన్మార్‌ మీదుగా గంగానదిలో […]

ప్రాజెక్ట్ పులస

Edited By:

Updated on: Sep 01, 2020 | 7:40 PM

పులస చాలా రుచికరంగా ఉంటుంది. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అంటారు. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీనిని వాళ్ళు ‘హిల్సా’ అని పిలుస్తారు.

నాలుగు కిలోల బరువున్న పులస(హిల్సా) చేపను ఓ వ్యక్తి రూ.22,000కు కొనుగోలు చేశాడు. 2016 జూన్‌లో పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో జరిగిందీ ఘటన. బంగాళాఖాతం నుంచి మయన్మార్‌ మీదుగా గంగానదిలో ఈదుకుంటూ మనదేశంలోకి వచ్చే ఈ చేపల రుచికి స్థానికులు ఎ౦తగానో ఇష్టపడతారు. నౌకలు, పడవల రాకపోకలను నియంత్రించేందుకు 1970లలో బెంగాల్లోని ఫరక్కా వద్ద గంగపై బ్యారేజీ నిర్మించడంతో అలహాబాద్‌(యూపీ)కు ఈ చేపల వలస ఆగిపోయింది. మళ్లీ 40 ఏళ్ల తర్వాత పులసలు సులువుగా అలహాబాద్‌కు వచ్చేలా ఫరక్కా బ్యారేజ్‌ గేట్లలో మార్పులు చేస్తున్నారు. జల్‌ మార్గ్‌ వికాస్ పరియోజన పథకంలో భాగంగా రూ.361 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు.