పోతుల సునీత షాకింగ్ డెసిషన్

ఎమ్యెల్సీ పోతుల సునీత షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. తన సడన్ డెసిషన్‌తో తనను ఎమ్మెల్సీని చేసిన తెలుగుదేశం పార్టీకి, అధినేత చంద్రబాబునాయుడుకు షాకిచ్చారామె.

పోతుల సునీత షాకింగ్ డెసిషన్
Follow us
Rajesh Sharma

|

Updated on: Oct 28, 2020 | 3:41 PM

Potula Suneetha resigned from council: ఎమ్యెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత సహాయకుని ద్వారా శాసన మండలి ఛైర్మన్ షరీఫ్‌కు తన రాజీనామా లేఖ పంపించారు. వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికిన నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై విచారణ కొనసాగుతుండగానే సునీత తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా బుధవారం లేఖను పంపించారు.

ఈ ఏడాది జనవరి 23వ తేదిన సీఎం జగన్‌తో భేటీ అయిన పోతుల సునీత.. వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఆమె భర్త, దివంగత పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్‌తోపాటు ఆమె ప్రభుత్వ అనుకూల వైఖరిని అవలంభిస్తున్నారు. ఇందులో భాగంగా రాజధానుల బిల్లు విషయంలో మండలిలో ఆమె ప్రభుత్వానికి మద్దతుగా ఓటేశారు. గతంలో శాసనమండలిలో రూల్‌ 71పై జరిగిన ఓటింగ్‌లో టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అధికారపక్షానికి అనుకూలంగా ఓటేశారు.

జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే రూల్‌ 71ను టీడీపీ పెట్టిందని, అందుకే సొంత పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశానని సునీత అప్పట్లో తెలిపారు. ఆమె విప్‌ను ధిక్కరించడంతో టీడీపీ వర్గాలు షాకయ్యాయి. 2014లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలైన సునీతకు చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. తెలుగు మహిళా అధ్యక్షురాలిగానూ సునీత పనిచేశారు.

తాజాగా ఆమె మండలి ఛైర్మెన్‌కు పంపిన లేఖలో టీడీపీపై సునిశిత విమర్శలు చేశారు. రాజ్యాంగ రచయిత డా. అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల శ్రేయస్సుకు వ్యతిరేకంగా టీడీపీ పనిచేస్తోందని ఆమె విమర్శించారు.

Also read: రైతు భరోసా కేంద్రాలపై గురుతర బాధ్యత.. జగన్ సంచలన నిర్ణయం

Also read: ఇళ్ళను ఆక్రమించుకుంటాం… టీడీపీ నేతల హెచ్చరిక

Also read: కొత్త సచివాలయ నిర్మాణానికి ‘సుప్రీం‘ ఓకే