పార్టీలతో ముగిసిన ఏపీ ఎన్నికల సంఘం భేటీ

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలతో విజయవాడలో నిర్వహించిన ఎన్నికల కమిషన్ భేటీ ముగిసింది. పాత ప్రక్రియ రద్దు చేసి..కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని మెజార్టీ పార్టీలు ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఎన్నికల కమిషన్ భేటీకి 19 పార్టీలకు ఆహ్వానం పంపగా, భేటీకి 11 పార్టీలు హాజరయ్యాయి. భేటీకి హాజరుకామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందే తెలిపిన సంగతి తెలిసిందే. ఇక మెయిల్ ద్వారా జనసేన పార్టీ తమ అభిప్రాయాన్ని తెలిపింది. రాజ్యాంగబద్దసంస్థ తీసుకునే నిర్ణయానికి […]

పార్టీలతో ముగిసిన ఏపీ ఎన్నికల సంఘం భేటీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 28, 2020 | 2:59 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలతో విజయవాడలో నిర్వహించిన ఎన్నికల కమిషన్ భేటీ ముగిసింది. పాత ప్రక్రియ రద్దు చేసి..కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని మెజార్టీ పార్టీలు ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఎన్నికల కమిషన్ భేటీకి 19 పార్టీలకు ఆహ్వానం పంపగా, భేటీకి 11 పార్టీలు హాజరయ్యాయి. భేటీకి హాజరుకామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందే తెలిపిన సంగతి తెలిసిందే. ఇక మెయిల్ ద్వారా జనసేన పార్టీ తమ అభిప్రాయాన్ని తెలిపింది. రాజ్యాంగబద్దసంస్థ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జనసేన తన సందేశంలో పేర్కొంది. 7 పార్టీలు ఈ భేటీకి గైర్హాజరయ్యాయి. వీటిలో వైసీపీ, టిఆర్ఎస్, నేషనలిస్టు కాంగ్రెస్, ఎమ్ఐఎమ్, జనతాదళ్ సెక్యులర్, రాష్ట్రీయ లోక్ దళ్, ఆర్ ఎస్పి, ఉన్నాయి. భేటీ పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.