కరోనా వైరస్‌ని అడ్డుకోవాలంటే.. అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిందే. ముఖ్యంగా.. కరోనా లక్షణాలతో ఎవరున్నా చెప్పాల్సిందే. దాచిపెడితే.. అది మొత్తం సమాజ నాశనానికి దారితీస్తుంది. ఈ విషయం తెలిసినా కూడా ఓ పోలీస్ ఆఫీసర్.. తన కొడుకు విదేశాల నుంచి వచ్చిన విషయం దాచి పెట్టినందుకు కేసు నమోదైంది. 10 రోజుల కిందట ఆ పోలీస్ ఆఫీసర్ కొడుకు లండన్ నుంచి వచ్చాడు. వచ్చి ఇంట్లో ఉండకుండా ఊళ్లో ఉన్న స్నేహితుల్ని కలిసేందుకు చాలా ప్రదేశాలకు వెళ్లాడు. అయితే తాజాగా అతని ఆరోగ్యంలో తేడా వచ్చింది. వెంటనే కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అతనిలో కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపారు. అక్కడ చెక్ చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.
దీంతో అలెర్ట్ అయిన అధికారులు అతన్ని వెంటనే ఐసోలేషన్ వార్డుకు పంపారు. అలాగే వారి ఇంట్లో తల్లిదండ్రులు, సోదరిని కూడా పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇదంతా మంత్రి ఈటెల వరకూ వెళ్లడంతో చాలా సీరియస్ అయ్యారు. అంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు మండిపడ్డారు. కొడుకు విదేశం నుంచి వచ్చినా.. విషయాన్ని దాచి పెట్టినందుకు ఆ పోలీస్ ఆఫీసర్‌పై కేసు నమోదు చేయమని ఆదేశించారు.
అలాగే.. ఆ పోలీస్ ఆఫీసర్‌తో పని చేసిన సిబ్బంది, ఇంట్లో వారు, కుర్రాడి ఫ్రెండ్స్‌ని కూడా కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారు. మరికొందరిని గాంధీ ఆస్పత్రికి పంపారు. ఒక్క విషయం దాచిపెట్టినందుకు.. ఇప్పుడు ఇంత పని అయింది. కాబట్టి.. విదేశాల నుంచి ఎవరైనా వస్తే దయచేసి చెప్పాలంటూ.. అటు డాక్టర్లు.. ఇటు పోలీసులు ప్రజలను కోరుతున్నారు.
Read more also: ఫ్లాష్ న్యూస్: విశాఖలో మరో మూడు కరోనా కేసులు
ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!
రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్
మీరు సూపరంటూ కేసీఆర్‌ని పొగిడేసిన అమిత్ షా
కరోనాను జయించాలంటే.. ఈ డైట్‌ని మెయిన్‌టైన్ చేయాల్సిందే