పంజాగుట్ట ఆర్టీసీ బస్సులో కాల్పుల ఘటన: వ్యక్తి గుర్తింపు

హైదరాబాద్‌లోని పంజాగుట్ట వద్ద నేటి మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని తెలంగాణ పోలీసులు గుర్తించారు. ఏపీ సెక్యూరిటీ వింగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తోన్న శ్రీనివాస్‌గా గుర్తించారు. విధులు ముగించుకొని ఆర్టీసీ బస్సు ఎక్కిన శ్రీనివాస్ ప్రయాణికులతో గొడవపడి కాల్పులు జరిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఏపీ డీజీపీ ఠాకూర్‌కు తెలంగాణ పోలీసులు సమాచారం అందించారు. ప్రజల మధ్యలో కాల్పులు జరపడం తీవ్రమైన నేరం అని, శ్రీనివాస్‌పై చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ ఠాకూర్ హామీ […]

పంజాగుట్ట ఆర్టీసీ బస్సులో కాల్పుల ఘటన: వ్యక్తి గుర్తింపు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 02, 2019 | 6:36 PM

హైదరాబాద్‌లోని పంజాగుట్ట వద్ద నేటి మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని తెలంగాణ పోలీసులు గుర్తించారు. ఏపీ సెక్యూరిటీ వింగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తోన్న శ్రీనివాస్‌గా గుర్తించారు. విధులు ముగించుకొని ఆర్టీసీ బస్సు ఎక్కిన శ్రీనివాస్ ప్రయాణికులతో గొడవపడి కాల్పులు జరిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఏపీ డీజీపీ ఠాకూర్‌కు తెలంగాణ పోలీసులు సమాచారం అందించారు. ప్రజల మధ్యలో కాల్పులు జరపడం తీవ్రమైన నేరం అని, శ్రీనివాస్‌పై చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ ఠాకూర్ హామీ ఇచ్చారు.