బ్రేకింగ్: ఇక అంతర్జాతీయ ఉగ్రవాదిగా ‘మసూద్‌ అజర్’

దౌత్యపరంగా భారత్‌కు భారీ విజయం దక్కింది. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మసూద్‌ను గ్లోబల్‌ టెర్రరిస్టుగా ప్రకటించాలని కోరుతూ భారత్‌ దశాబ్ధ కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు ఇప్పటికే భారత్‌ డిమాండ్‌కు బాసటగా నిలవగా మోకాలడ్డుతున్న చైనా తన వైఖరిని మార్చుకోవడంతో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి బుధవారం ప్రకటించింది. భారత్‌ నిరంతర దౌత్య ప్రయత్నాలతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు చైనాతో […]

బ్రేకింగ్: ఇక అంతర్జాతీయ ఉగ్రవాదిగా 'మసూద్‌ అజర్'
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 01, 2019 | 7:17 PM

దౌత్యపరంగా భారత్‌కు భారీ విజయం దక్కింది. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మసూద్‌ను గ్లోబల్‌ టెర్రరిస్టుగా ప్రకటించాలని కోరుతూ భారత్‌ దశాబ్ధ కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు ఇప్పటికే భారత్‌ డిమాండ్‌కు బాసటగా నిలవగా మోకాలడ్డుతున్న చైనా తన వైఖరిని మార్చుకోవడంతో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి బుధవారం ప్రకటించింది.

భారత్‌ నిరంతర దౌత్య ప్రయత్నాలతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు చైనాతో నెరపిన లాబీయింగ్‌ ఫలించింది. నిరంతర చర్చలు, దౌత్య యత్నాలతోనే జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు. జమ్ము కశ్మీర్‌లో దాడి నేపధ్యంలో ఓ ఉగ్రవాదిని ఐక్యరాజ్యసమితి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సమయంలో ఈ పరిణామం ప్రధాని నరేంద్ర మోదీకి కలిసివస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

మరోవైపు ఉగ్రవాదంపై పోరులో ప్రపంచదేశాలన్నీ కలిసి రావడంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. తమకు మద్దతిచ్చిన అన్ని దేశాలకూ ధన్యవాదాలు తెలిపింది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం వల్ల మసూద్ అజహర్‌‌పై తీవ్ర ఆంక్షలు ఏర్పడతాయి. మసూద్ ఆస్తులను పూర్తిగా స్థంభింపచేస్తారు. కదలికలపై నిషేధం ఉంటుంది. ఐక్యరాజ్యసమితి తీసుకున్న నిర్ణయంతో పాకిస్థాన్‌ మరిన్ని చిక్కుల్లో పడింది. అసలే ఉగ్రవాద కేంద్రంగా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి ఇచ్చిన షాక్‌తో అంతర్జాతీయంగా పరువు పోయినట్లైంది.