‘ఫొని’ డేంజర్ దూసుకొస్తోంది!
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుఫాను తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర పెనుతుఫానుగా మారింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. ఒడిశాలోని పూరీకి 650 కిలోమీటర్లు, విశాఖకు ఆగ్నేయంగా 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను మరింత బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తుఫాను దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ నెల 3న మధ్యాహ్నం ఒడిశాలోని పారాదీప్‌కు సమీపంలో తీరం దాటే […]
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుఫాను తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర పెనుతుఫానుగా మారింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. ఒడిశాలోని పూరీకి 650 కిలోమీటర్లు, విశాఖకు ఆగ్నేయంగా 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను మరింత బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తుఫాను దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ నెల 3న మధ్యాహ్నం ఒడిశాలోని పారాదీప్‌కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 205 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తుఫాను ప్రభావం ఏపీపై తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ నెల 2, 3 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంటకు 80- 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాను గమనాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.