పాక్‌లో దెబ్బతిన్న గురుద్వారా గోపురాలు.. రీజన్‌ ఇదేనట..!

సిక్కుల పవిత్ర స్థలమైన కర్తార్‌పూర్ గురించి తెలిసిందే. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న గురుద్వారా సాహిబ్‌లో ఘోరం జరిగిపోయింది. పాకిస్థాన్‌లోని పంజబాద్‌ రాష్ట్రంలో ఈ కర్తార్‌పూర్ గురుద్వారా సాహిబ్ ఉంది. అయితే అక్కడ భారీ వర్షాలతో పాటు, బలంగా వీస్తున్న గాలులకు కర్తార్‌పూర్ గురుద్వారా సాహిబ్‌లో కొన్ని గోపురాలు కుప్పకూలాయి. అయితే ఈ గోపురాల పునర్నిర్మాణంలో సిమెంట్, ఇనుముకు బదులుగా.. ఫైబర్ ఉపయోగించి నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యత లేకుండా ఫైబర్‌తో చేయడం కారణంగానే.. ఈ […]

పాక్‌లో దెబ్బతిన్న గురుద్వారా గోపురాలు.. రీజన్‌ ఇదేనట..!
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 7:10 PM

సిక్కుల పవిత్ర స్థలమైన కర్తార్‌పూర్ గురించి తెలిసిందే. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న గురుద్వారా సాహిబ్‌లో ఘోరం జరిగిపోయింది. పాకిస్థాన్‌లోని పంజబాద్‌ రాష్ట్రంలో ఈ కర్తార్‌పూర్ గురుద్వారా సాహిబ్ ఉంది. అయితే అక్కడ భారీ వర్షాలతో పాటు, బలంగా వీస్తున్న గాలులకు కర్తార్‌పూర్ గురుద్వారా సాహిబ్‌లో కొన్ని గోపురాలు కుప్పకూలాయి. అయితే ఈ గోపురాల పునర్నిర్మాణంలో సిమెంట్, ఇనుముకు బదులుగా.. ఫైబర్ ఉపయోగించి నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యత లేకుండా ఫైబర్‌తో చేయడం కారణంగానే.. ఈ గురుద్వారాల గోపురాలు కూలిపోయాయన్న ఆరోపణలోస్తున్నాయి. ఈ క్రమంలో కర్తార్‌పూర్ కారిడార్, గురుద్వారాల నిర్మాణానికి సంబంధించిన నాణ్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఈ ఘటనపై పాక్ ప్రభుత్వం స్పందించింది. పాక్‌కు చెందిన శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ చౌదరి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని మత వ్యవహారాల మంత్రి నూర్ ఉల్ హక్ ఖాద్రికి తెలుపుతామని.. ఘటనపై వెంటనే దర్యాపునకు ఆదేశిస్తామన్నారు. ప్రస్తుతం దెబ్బతిన్న గోపురాల మరమ్మత్తుకు సంబంధించిన పనిని ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌డబ్ల్యుఓ)కు అప్పగించినట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పనులు రెండు రోజుల్లో పూర్తవుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

కాగా.. ఈ కర్తార్‌పూర్‌ కారిడార్‌ పునర్నిర్మాణంలో విదేశాల నుంచి సిక్కులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు.