ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్

ఏపీలో నయా హిస్టరీ క్రియేట్ అయింది. అప్లై చేసుకున్న  రోజే రేషన్ కార్డు మంజూరైంది. ఒక్కరోజులో రేషన్ కార్డు రావడం రికార్డుగానే చెప్పకోవాలి.

ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 17, 2020 | 10:33 AM

ఏపీలో నయా హిస్టరీ క్రియేట్ అయింది. అప్లై చేసుకున్న  రోజే రేషన్ కార్డు మంజూరైంది. ఒక్కరోజులో రేషన్ కార్డు రావడం రికార్డుగానే చెప్పకోవాలి. వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా మడికి పంచాయతీ సచివాలయం–2 పరిధిలో నివశిస్తోన్న కుడిపూడి ఆంజనేయులు, వరలక్ష్మి దంపతులు గతంలో చాలాసార్లు రేషన్‌ కార్డు కోసం అప్లై  చేసుకున్నా పని అవ్వలేదు. దీంతో తాజాగా వారు గ్రామ వాలంటీర్‌‌ను కలిసి ఇబ్బందిని తెలియజేశారు. వాలంటీర్ వారిని మంగళవారం గ్రామ సచివాలయానికి తీసుకెళ్లి మరోసారి దరఖాస్తు చేయించాడు.  ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తును తహసీల్దార్‌ సమర్పించగా.. ఆయన వెంటనే లబ్ధిదారుని అర్హతల్ని పరిశీలించి బుధవారం రేషన్‌ కార్డు మంజూరు చేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన పిల్లి లక్ష్మి అనే ఒంటరి మహిళకు కూడా ఒక్క రోజులోనే రేషన్‌ కార్డు వచ్చింది.

గతంలో రేషన్ కార్డు కావాలంటే చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని .. ఇప్పుడు ఒక్కరోజులోనే కార్డు రావడంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.  అర్హతలున్న వారు ఎవరైనా సరే వాలంటీర్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే గ్రామ సచివాలయం ద్వారా పది రోజుల్లో రేషన్ కార్డు అందజేయాలనేది జగన్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read : మరో ఘటన : నిడమానూరులో సాయిబాబా విగ్రహం ధ్వంసం