Venkata Narayana |
Updated on: Mar 26, 2021 | 10:23 PM
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి భారత్ - బంగ్లాదేశ్ రెండూ ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న మోదీ ఢాకాలో జరిగిన బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ కరచాలనం(File Photo)
అంతకుముందు భారత ప్రధాని మోదీ బంగ్లా అమరవీరుల స్మారక స్థలాన్ని సందర్శించి, జాతీయ పరాక్రమ వీరులకు ఘన నివాళులర్పించారు.
కాగా, బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఢాకాలో పండిట్ అజోయ్ చక్రవర్తి స్వరపరిచిన రాగాలాపన ప్రముఖులను, ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.
బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మోమెన్, భారత ప్రధాని నరేంద్రమోదీని సాధరంగా ఆహ్వానించి ఇరుదేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
పాకిస్తాన్ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం, దీనికి ప్రతిగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ మరో లేఖ రాయడం తెలిసిందే. ఈ సుహృద్భావ వాతావరణం ఏర్పడ్డ తర్వాతి రోజే ఈ కీలక వాణిజ్య పరిణామం చోటు చేసుకోవడం విశేషం.