టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై సెటైర్లు వేసి… ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీలో కొనసాగుతున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియపై నారాలోకేశ్ ట్వీట్లతో తెరమీదికొచ్చారు మరోసారి.
‘‘వినేవాళ్లు అమాయకులయితే చెప్పేవారు జగన్ గారు‘‘ అన్నట్టుంది పరిస్థితి అంటూ బుధవారం ట్వీట్ చేశారు లోకేశ్. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి నిధులు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి వైకాపా కార్యకర్తలకు సెల్ ఫోన్లు కొనడానికి 233 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆయన ఆరోపించారు.
ఈ స్కీంలో రూ.233 కోట్ల ప్రజాధనానికి జగన్ గారు టెండర్ పెట్టడం తప్ప రివర్స్ టెండరింగ్ ఎక్కడ ఉంది?ఇకపోతే జగన్ గారి పారదర్శకత ప్రకారం రూ.100కోట్లు దాటిన టెండర్లకు జ్యూడిషయల్ ప్రివ్యూ జరగాలి. మరి ఫోన్ల టెండర్లను ప్రివ్యూకు పంపలేదే? అంటే జే ట్యాక్స్ కడితే ప్రివ్యూ ఉండదా జగన్ గారు?(3/3)
— Lokesh Nara (@naralokesh) December 4, 2019
గ్రామ వాలంటీర్లు అన్న పేరుతో నియమించిన వైసీపీ కార్యకర్తల కోసం ఫోన్లు కొంటూ.. రివర్స్ టెండరింగ్‌లో 83 కోట్ల రూపాయలు ఆదా అంటూ జగన్ అందరి చెవుల్లో క్యాబేజీ పెట్టారని లోకేశ్ సెటైర్లు వేశారు. జగన్ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, రెండు సార్లూ ఒకే కంపెనీ టెండర్ దాఖలు చేసిందని, అందులో మర్మమేంటని లోకేశ్ ప్రశ్నించారు.
ఈ స్కీంలో 233 కోట్ల రూపాయల ప్రజాధనానికి జగన్ టెండర్ పెట్టడం తప్ప.. రివర్స్ టెండరింగ్ ఎక్కడ ఉందని లోకేశ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ పారదర్శకత ప్రకారం 100 కోట్ల రూపాయలు దాటిన టెండర్లకు జ్యూడిషయల్ ప్రివ్యూ జరగాల్సి వుందని, మరి ఫోన్ల టెండర్లను జ్యూడిషయల్ ప్రివ్యూకు పంపలేదేమని ప్రశ్నించారు లోకేశ్. జే ట్యాక్స్ కడితే ప్రివ్యూ ఉండదా అంటూ మఖ్యమంత్రికి ప్రశ్నల వర్షం కురిపించారు నారాలోకేశ్.