మూడు రాజధానులపై స్పందించిన ఎంపీ గోరంట్ల..ఎమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ రాజధాని రగడపై స్పందించారు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. మూడు రాజధానులు అంటే ముగ్గురు కొడుకులతో సమానం అని అన్నారు. ముగ్గురు కొడుకులకు సమాన హక్కులు కల్పించాల్సిన భాద్యత ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని హాలుకూరు గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎంపీ గోరంట్ల మాధవ్. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఆయన..రాజధాని అంశంపై తెలుగుదేశం పార్టీ దొంగనాటకాలు వేస్తోందని ఆరోపించారు. టీడీపీ నేతల మొసలి […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని రగడపై స్పందించారు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. మూడు రాజధానులు అంటే ముగ్గురు కొడుకులతో సమానం అని అన్నారు. ముగ్గురు కొడుకులకు సమాన హక్కులు కల్పించాల్సిన భాద్యత ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు. వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని హాలుకూరు గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎంపీ గోరంట్ల మాధవ్. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఆయన..రాజధాని అంశంపై తెలుగుదేశం పార్టీ దొంగనాటకాలు వేస్తోందని ఆరోపించారు. టీడీపీ నేతల మొసలి కన్నీళ్లు ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. రాయలసీమను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని కోరారు. చిన్నకొడుకుగా రాయలసీమ ఇప్పటి వరకు చాలా నష్టపోయిందని, అభివృద్ధి ఏమాత్రం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజలు వాస్తవాలను గ్రహించగలిగారని, తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండరని హెచ్చరించారు.