అక్రమ మైనింగ్ కేసులో యరపతినేనికి బిగుస్తున్న ఉచ్చు

టీడీపీకి మరో షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌కు అక్రమ మైనింగ్ కేసులో ఉచ్చుబిగుస్తోంది. ఆయనపై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. యరపతినేని శ్రీనివాస్‌తో పాటు మరో 15 మందిపై కేసులు నమోదు చేసింది. గురజాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో యరపతినేని, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అయితే […]

అక్రమ మైనింగ్ కేసులో యరపతినేనికి బిగుస్తున్న ఉచ్చు
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 26, 2019 | 6:01 PM

టీడీపీకి మరో షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌కు అక్రమ మైనింగ్ కేసులో ఉచ్చుబిగుస్తోంది. ఆయనపై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. యరపతినేని శ్రీనివాస్‌తో పాటు మరో 15 మందిపై కేసులు నమోదు చేసింది. గురజాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో యరపతినేని, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం యరపతినేనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కృష్ణారెడ్డి అనే వ్యక్తి 2016లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, ఆ తర్వాత 2018లో గుంటూరు జిల్లా దాచేపల్లి, కొండమోడు, పిడుగురాళ్ల, నడికుడి, అమరావతి ప్రాంతాలకు చెందిన మరో 15 మందిపై 17 కేసులు నమోదయ్యాయి.

ఇక ఈ వ్యవహారంలో వైసీపీ గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో నారా లోకేష్‌కు కూడా వాటాలు ముట్టాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఈ స్కామ్‌లో నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు యరపతినేని మైనింగ్‌ కేసును.. సీబీఐకి అప్పగించడంపై జిల్లా టీడీపీ నేతలు ఎవ్వరూ స్పందించడం లేదు. అయితే స్థానిక నేతలు మాత్రం ఇది.. టీడీపీని దెబ్బతీసేందుకే.. జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు.

ఈ అక్రమ మైనింగ్‌ కేసులో వేముల శ్రీనివాసరావు, తిప్పవజుల నారాయణశర్మలపై రెండేసి కేసులు, మరో 13 మందిపై ఒక్కో కేసు నమోదైంది. యరపతినేనితో కలిపి మొత్తం 16 మందిపై 18 కేసులు నమోదయ్యాయి. పిడుగురాళ్ల మండలం కేసనుపల్లి, కోనంకి గ్రామాల్లో సున్నపురాయి అక్రమ తవ్వకం, రవాణా.. దాచేపల్లి మండలం నడికుడి గ్రామాల్లో అక్రమ మైనింగ్‌ జరిగినట్టు గుర్తించారు. కోనంకిలో 690, 691, 692 సర్వే నంబర్‌లోను, కేసనుపల్లిలోని 324/ఎ, 336/1బి, 336/5, 336/6లోను, నడికుడిలోని 17/4, 17/5, 17/6, 17/7, 15 సర్వే నంబర్లలో అక్రమ మైనింగ్‌ జరిగినట్టు నిర్ధారించారు.

యరపతినేని, అనుచరులపై కేసులు

యరపతినేని శ్రీనివాసరావు–హైకోర్టు పిల్‌ 170/2016, మీనిగ అంజిబాబు– 308/2018 తిప్పవజుల నారాయణశర్మ–309/2018, గ్రంధి అజయ్‌కుమార్‌–310/2018 తిప్పవజుల నారాయణశర్మ–311/2018, రాజేటి జాకబ్‌–312/2018 గుదె వెంకట కోటేశ్వరరావు–313/2018, వర్సు ప్రకాశ్‌–314/2018 వర్ల రత్నం దానయ్య–315/2018, నంద్యాల నాగరాజు–316/2018 నీరుమళ్ల శ్రీనివాసరావు–317/2018, ఆలపాటి నాగేశ్వరరావు–318/2018 వేముల శ్రీనివాసరావు–181/2018, వర్సు వెంకటేశ్వరరావు–182/2018 వేముల ఏడుకొండలు–183/2018, ఈర్ల వెంకటరావు–184/2018 బి. నరసింహారావు–185/2018, వి. శ్రీనివాసరావు–186/2018

26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే