టీవీ రిమోట్ అడిగినందుకు ఏడేళ్ల చిన్నారి హత్య
తమిళనాడులో దారుణం జరిగింది. ఛానల్ మార్చామని అడిగిన పాపానికి ఏడేళ్ల చిన్నారిని హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చెత్తకుప్పలో శవమై కనిపించింది. ఘాతుకానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తమిళనాడు తుత్తుకుడి జిల్లాకు చెందిన సాతంకుళం పట్టణానికి చెందిన ఏడేళ్ల చిన్నారికి టీవీ చూడానికి ప్రతిరోజు పక్కింటికి వెళ్తుంది. ఇదే క్రమంలో ఎప్పటిలాగే టీవీ చూసేందుకు పక్కింటికి వెళ్లింది. ఇదే సమయంలో ఆ ఇంటి యజమాని తన కొడుకుతో గొడవపడుతున్నాడు. అమాయకురాలైన చిన్నారి ఛానల్ మార్చుకుంటాను టీవీ రిమోట్ ఇవ్వమని కోరింది. దీంతో నిందితుడు ఆ బాలిక గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం బాలిక మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి స్నేహితుడి సాయంతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న డంపింగ్ యార్డ్ లో పడేసి వచ్చాడు.
ఇదిలావుంటే, తమ కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా, పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్ లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. డెడ్ బాడీని పరిశీలించిన పోలీసులు.. బాధితురాలు హత్యకు గురైనట్లు తేల్చారు. నిందితుల కోసం తనదైన స్టైల్లో విచారించగా పక్కింటికి చెందిన వ్యక్తి హత్య చేసినట్లు తేలింది. నిందితుడు అతడి స్నేహితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, గతంలో నిందితులపై పలు కేసులు ఉన్నట్లు, గంజాయి అమ్మకాలు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.