నేటితో ముగియనున్న కుంభమేళా ఉత్సవాలు

ఈ ఏడాది జనవరి 15న ప్రారంభమైన ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 400మంది కేంద్ర పారా మిలిటరీ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇక ఇవాళ మహా శివరాత్రి కావడంతో దాదాపు 60లక్షల నుంచి కోటి మంది భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తారని అధికారులు పేర్కొన్నారు. దీంతో భారీ స్థాయిలో వచ్చే యాత్రికుల కోసం పటిష్ట ఏర్పాటు చేశామని జిల్లా మేజిస్ట్రేట్ విజయ్ కిరణ్ ఆనంద్ వెల్లడించారు. కాగా ప్రయాగరాజ్‌లో ప్రతి […]

నేటితో ముగియనున్న కుంభమేళా ఉత్సవాలు
Follow us

| Edited By:

Updated on: Mar 04, 2019 | 9:39 AM

ఈ ఏడాది జనవరి 15న ప్రారంభమైన ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 400మంది కేంద్ర పారా మిలిటరీ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇక ఇవాళ మహా శివరాత్రి కావడంతో దాదాపు 60లక్షల నుంచి కోటి మంది భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తారని అధికారులు పేర్కొన్నారు. దీంతో భారీ స్థాయిలో వచ్చే యాత్రికుల కోసం పటిష్ట ఏర్పాటు చేశామని జిల్లా మేజిస్ట్రేట్ విజయ్ కిరణ్ ఆనంద్ వెల్లడించారు. కాగా ప్రయాగరాజ్‌లో ప్రతి ఆరేళ్లకు కుంభమేలా జరుగుతుండగా.. ప్రతి 12 ఏళ్లకు మహాకుంభమేళాను యాత్రికులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

Latest Articles