జగన్‌కు కేటీఆర్ కంగ్రాట్స్
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతోంది. ఇప్పటివరకు 152 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌కు సర్వత్రా అభినందనలు మొదలయ్యాయి. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఏపీ ఎన్నికల ఫలితాల్లో అద్భుత విజయం దిశగా దూసుకెళ్తోన్న వైఎస్ జగన్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ప్రజల మనసును గెలిచేందుకు మీరు పడ్డ కష్టానికి ఫలితం లభించింది. మా సోదరీమణీ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న […]
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతోంది. ఇప్పటివరకు 152 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌కు సర్వత్రా అభినందనలు మొదలయ్యాయి. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఏపీ ఎన్నికల ఫలితాల్లో అద్భుత విజయం దిశగా దూసుకెళ్తోన్న వైఎస్ జగన్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ప్రజల మనసును గెలిచేందుకు మీరు పడ్డ కష్టానికి ఫలితం లభించింది. మా సోదరీమణీ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న మీకు ఆల్ ది బెస్ట్’’ అంటూ ట్వీట్ చేశారు.
Wholehearted congratulations to Sri @ysjagan Garu on a landslide victory?. Your hardwork has paid off in the form of overwhelming blessing of people?
Wishing you the very best in governing our sister state of Andhra Pradesh
— KTR (@KTRTRS) May 23, 2019