
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి కన్నుమూశారు. కేరళలోని ఎడనీర్ మఠ్‌లో కేశవానంద భారతి శివైక్యం పొందినట్లు పోలీసులు ప్రకటించారు. గత కొంతకాలంగా కేశవానంద భారతి అనారోగ్యంతో బాధపడతున్నట్టు ఆశ్రమవర్గాలు వెల్లడించాయి. ఆధ్యాత్మికవేత్తగానే కాకుండా రాజ్యాంగ హక్కులపై ఆయన చేసిన న్యాయపోరాటంతోనే దేశవ్యాప్తంగా కేశవానంద భారతి గుర్తింపు పొందారు.
సుప్రీంకోర్టు కేసుల్లో స్వామి కేశవానంద భారతి కేసు చరిత్రాత్మకమైంది. దీన్నే కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసుగా సంచలనం. పలు కేసులకు దీనినే మైలురాయిగా తీసుకుంటారు. 29 ఏళ్ల వయసులోనే సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఓ సంచలనం. ఈ కేసు సుప్రీంకోర్టు చరిత్రలో సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. ఏకంగా 68 రోజుల పాటు ఈ కేసు విచారణ నడిచింది. ఏకంగా 13 మంది న్యాయమూర్తులతో ఏర్పాటైన విస్తృత ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. 68 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసు కేశవానంద భారతికి అనుకూలంగా వెలువడింది.