సౌదీ పెట్టుబడి అక్షరాలా 7 లక్షల కోట్లు.. మోదీ ఏం చేశాడంటే?

| Edited By: Ram Naramaneni

Oct 29, 2019 | 9:46 PM

ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనీషియేటివ్ (ఎఫ్ఐఐ) ప్రపంచ సంక్షేమానికి దోహదపడగలదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ఈ పెట్టుబడుల సదస్సులో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎఫ్ఐఐ ఫోరాన్ని ప్రశంసించారు. దీని ఆశయం ఇక్కడి ఆర్థిక వ్యవస్థ గురించి చర్చించడం మాత్రమే కాదని, ప్రపంచంలో వస్తున్న ధోరణులను అర్థం చేసుకోవడంతోపాటు, ప్రపంచ సంక్షేమానికి మార్గాలను అన్వేషించడం కూడానని పేర్కొన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మోదీ మాట్లాడుతూ రాబోయే ఐదేళ్ళలో ఆర్థిక […]

సౌదీ పెట్టుబడి అక్షరాలా 7 లక్షల కోట్లు.. మోదీ ఏం చేశాడంటే?
Follow us on

ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనీషియేటివ్ (ఎఫ్ఐఐ) ప్రపంచ సంక్షేమానికి దోహదపడగలదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ఈ పెట్టుబడుల సదస్సులో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎఫ్ఐఐ ఫోరాన్ని ప్రశంసించారు. దీని ఆశయం ఇక్కడి ఆర్థిక వ్యవస్థ గురించి చర్చించడం మాత్రమే కాదని, ప్రపంచంలో వస్తున్న ధోరణులను అర్థం చేసుకోవడంతోపాటు, ప్రపంచ సంక్షేమానికి మార్గాలను అన్వేషించడం కూడానని పేర్కొన్నారు.

భారత దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మోదీ మాట్లాడుతూ రాబోయే ఐదేళ్ళలో ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. నేటి ప్రపంచ వ్యాపార రంగంపై ప్రభావం చూపుతున్న సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, పర్యావరణం పట్ల కారుణ్యం, వ్యాపారం/గవర్నెన్స్ గురించి చర్చించాలనుకుంటున్నట్లు తెలిపారు. వ్యాపార సంస్థల ఏర్పాటు, ఆర్థికాభివృద్ధిలో తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉండటం ఎంత ముఖ్యమో వివరించారు.

ప్రపంచంలో 3వ అతి పెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్‌గా భారత దేశం ఎదిగిందని చెప్పారు. భారత దేశంలోని రెండో స్థాయి, మూడో స్థాయి పట్టణాల్లో సైతం స్టార్టప్‌లు ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు స్టార్టప్‌లు ముందుకు వస్తున్నాయన్నారు. భారత దేశంలోని స్టార్టప్ ఎకో సిస్టమ్‌ నుంచి లబ్ధి పొందేందుకు రావాలని ప్రపంచ పెట్టుబడిదారులను కోరారు.

రిఫైనింగ్, పైప్‌లైన్స్, గ్యాస్ టెర్మినల్స్ రంగాల్లో 2024నాటికి 100 బిలియన్ డాలర్లు (సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు) పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్ట్‌లో సౌదీ ఆరామ్‌కో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఈ రిఫైనరీ ఆసియాలోనే అతి పెద్దదని చెప్పారు.సౌదీ అరేబియా విజన్ 2030 సాకారం కోసం కలిసి పని చేస్తామని చెప్పారు.