తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య
హైదరాబాద్ మహానగరంలోని చందానగర్ లో విషాదం చోటుచేసుకుంది. తల్లి మందలించడంతో కుమారుడు సంతోష్ కుమార్(18) బలవన్మరణానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్ మహానగరంలోని చందానగర్ లో విషాదం చోటుచేసుకుంది. తల్లి మందలించడంతో కుమారుడు సంతోష్ కుమార్(18) బలవన్మరణానికి పాల్పడ్డాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల లో ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
చందానగర్ ప్రాంతానికి చెందిన సంతోష్ డిప్లొమా చదువుతూ మధ్యలోనే ఆపేసి ఇంటి పట్టునే ఉంటున్నాడు. అయితే, గత కొద్దిరోజులుగా అటు చదువు చదవక, ఇటు ఉద్యోగం చెయ్యక తిరుగుతుండడంతో తల్లి మందలించింది. దీంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నిన్న శుక్రవారం ఉదయం ఇంట్లో నుండి వెళ్లిపోయాడు సంతోష్. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు తో నిన్న చందానగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా నల్లగండ్ల హుడా లే ఔట్ లో సంతోష్ కుమార్ ఆచూకీ ని కనుకున్నారు పోలీసులు.
పోలీసులు, కుటుంబసభ్యలతో సహా ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికే సంతోష్ మృతదేహం పూర్తిగా దగ్ధమై కనిపించింది. ఒంటిపై కిరోసిన పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్నిఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
