AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రాలకు హోంశాఖ హెచ్చరిక

ఊహించిన దానికంటే కరోనా వైరస్ వేగంగా ప్రబలుతుండడం వెనుక రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వుందని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్...

రాష్ట్రాలకు హోంశాఖ హెచ్చరిక
Rajesh Sharma
|

Updated on: May 21, 2020 | 7:45 PM

Share

Home ministry warned all states and union territories in the country: ఊహించిన దానికంటే కరోనా వైరస్ వేగంగా ప్రబలుతుండడం వెనుక రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వుందని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా రాష్ట్ర ప్రభుత్వాలకు గురువారం లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లకు లేఖ రాసిన అజయ్ భల్లా.. కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించకపోతే ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

‘‘ హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కొన్ని ప్రాంతాలలో ఉల్లంఘిస్తున్నారు.. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని మార్గదర్శకాలు ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలి.. మార్గదర్శకాలను అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు స్థానిక అధికారులు తీసుకోవాలి.. ’’ అని అజయ్ భల్లా గురువారం పంపిన లేఖల్లో పేర్కొన్నారు.

పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ హెచ్చరికలను జారీ చేయడం గమనార్హం. మరోవైపు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కేంద్ర చేసిన రాత్రి పూట కర్ఫ్యూని అమలు పరచబోమని ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు అధికార ప్రకటన చేయనప్పటికీ.. సామాజిక దూరం వంటి నిబంధనలను పాటించడం లేదు.

మరోవైపు అంతర్రాష్ట్ర రోడ్డు రవాణా అంశాన్ని కేంద్ర రాష్ట్రాలకు అప్పగించింది. రైలు ప్రయాణాలను ప్రారంభించిన రైల్వే శాఖ.. జూన్ ఒకటి నుంచి సాధారణ రైళ్ళను కూడా నడిపేందుకు టికెట్లను జారీ చేస్తోంది. మే 25వ తేదీ నుంచి దేశంలో డొమెస్టిక్ విమానాలను కూడా నడపబోతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక దూరం, శానిటైజర్లు, ఫేస్ మాస్కుల వినియోగంతోపాటు పెద్ద సమూహాలుగా కూడే సభలు, సమావేశాలను నిర్వహించకుండా చూసుకోవడం రాష్ట్రాల విధిగా మారింది. ఈ సూచనలను పాటించని రాష్ట్రాలు తీరు మార్చుకోవాలని హోం శాఖ కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నారు.