Breaking: కలెక్టర్లకు జరిమానా, ఆర్టీఓకు జైలుశిక్ష
హైదరాబాద్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. ఏకంగా ఇద్దరు కలెక్టర్లకు జరిమానా విధించింది. ఓ ఆర్డీఓకు రెండు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. జ్యూడిషియల్ పవర్ కలిగిన కలెక్టర్లకు, ఆర్డీఓకు హైకోర్టు శిక్ష విధించడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోర్టు దిక్కరణ కేసులో హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు కలెక్టర్లకు, ఒక ఆర్డీఓకు శిక్ష ఖరారు చేసింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్న అభియోగాలతో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల […]
హైదరాబాద్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. ఏకంగా ఇద్దరు కలెక్టర్లకు జరిమానా విధించింది. ఓ ఆర్డీఓకు రెండు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. జ్యూడిషియల్ పవర్ కలిగిన కలెక్టర్లకు, ఆర్డీఓకు హైకోర్టు శిక్ష విధించడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోర్టు దిక్కరణ కేసులో హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు కలెక్టర్లకు, ఒక ఆర్డీఓకు శిక్ష ఖరారు చేసింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్న అభియోగాలతో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లకు రెండు వేల రూపాయల జరిమానా విధించారు.
సిద్దిపేట ఆర్డీఓ జయచందర్ రెడ్డికి రెండు నెలల జైలుశిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధించింది హైకోర్టు. 2018లో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో రైతుల అభ్యంతరాలు వినకుండా డిక్లరేషన్, అవార్డు ఇచ్చారని కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో డిక్లరేషన్‌ను, అవార్డును రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది.
2019 మే నెలలో హైకోర్టు ఆదేశాలను పాటించకుండా మళ్ళీ డిక్లరేషన్, అవార్డు ప్రకటించారని మరోసారి రైతులు కోర్టుకెక్కారు. రైతుల పిటిషన్‌లను విచారించిన హైకోర్టు.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌లకు 2 వేల రూపాయల జరిమానా విధించింది. నాలుగు వారాల్లో జరిమానా మొత్తాన్ని చెల్లించకపోతే నెల రోజుల జైలుశిక్ష విధించాలని హైకోర్టు ఆదేశించింది.