హేమంత్‌ను అందుకే చంపేశారు !

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హేమంత్‌ పరువు హత్య కేసు విచారణ కొనసాగుతోంది. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.

హేమంత్‌ను అందుకే చంపేశారు !
Follow us

|

Updated on: Oct 01, 2020 | 6:34 PM

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హేమంత్‌ పరువు హత్య కేసు విచారణ కొనసాగుతోంది. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్‌రెడ్డిలను చర్లపల్లి జైలు నుంచి గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆరు రోజుల పాటు వీరిద్దరిని కస్టడీకి తీసుకున్న పోలీసులు మొదటి రోజు కీలక ప్రశ్నలకు సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.

అవంతి ప్రేమ విషయం తెలిసి వారించామని, ఇంట్లో నిర్బంధించినప్పటికీ తప్పించుకొని వెళ్లి పెళ్లి చేసుకుందని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి పోలీసులకు చెప్పారు. పోలీసుల ద్వారా పెళ్లి గురించి తమకు తెలిసిందని.. ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించే ఫ్యామిలీ తమదని తెలిపారట. బయట తలెత్తుకొని తిరగలేక పోయామని అందుకే హేమంత్‌ను హత్య చేయాల్సి వచ్చిందని చెప్పినట్లు సమాచారం. అయితే హేమంత్‌ను కిడ్నాప్ చేసి హత్యచేసిన ఏరియాలో నిందితులతో పోలీసులు మరోసారి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు.

మరోవైపు అవంతి, హేమంత్ ఫ్యామిలీ మెంబర్స్ బుధవారం సీపీ సజ్జనార్‌ను కలిశారు. తమ ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఇంత దారుణంగా హత్యకు పాల్పడిన నిందితులకు కూడా కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని సీపీకి వినతి పత్రం అందించారు. దీనిపై సానుకూలగా స్పందించిన సీపీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read :

దేశంలో కరోనా కలవరం

శీతాకాలంలో కరోనా ముప్పు మరింత అధికమట !

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.