చంద్రబాబుపై ఫైర్ అయిన జీవీఎల్
బీజీపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి చంద్రబాబుపై విమర్శల దాడి చేశారు. చంద్రబాబు తన బినామీ ఎంపీలకు 5వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు కట్టబెట్టారన్న ఆయన.. అందులో ముఖ్యమంత్రి వాటా ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశానికి ప్రతిపక్ష హోదా కూాడా రాదని…2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. పోలవరం విషయంలో సోమవారాన్ని సొమ్మువారంగా చంద్రబాబు మార్చుకున్నారని జీవీఎల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన సొంత జిల్లాలోనే ప్రజలకు తాగునీరు అందని దుస్థితి […]
బీజీపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి చంద్రబాబుపై విమర్శల దాడి చేశారు. చంద్రబాబు తన బినామీ ఎంపీలకు 5వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు కట్టబెట్టారన్న ఆయన.. అందులో ముఖ్యమంత్రి వాటా ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశానికి ప్రతిపక్ష హోదా కూాడా రాదని…2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందన్నారు.
పోలవరం విషయంలో సోమవారాన్ని సొమ్మువారంగా చంద్రబాబు మార్చుకున్నారని జీవీఎల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన సొంత జిల్లాలోనే ప్రజలకు తాగునీరు అందని దుస్థితి ఉందని పేర్కొన్నారు. ఏ వర్గాన్నీ అంత ప్రాధాన్యం ఇవ్వని చంద్రబాబు రియల్టర్లు, గుత్తేదారులపై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.