Covid tension కరోనాతో చనిపోయారా? ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందే

తెలంగాణలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైద్యసిబ్బందికి కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం. వైద్య సిబ్బందికి ఎలాంటి హానీ కలుగకుండా చూసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో...

Covid tension కరోనాతో చనిపోయారా? ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందే

Edited By:

Updated on: Apr 09, 2020 | 1:45 PM

Telangana government released new guidelines for medical teams: తెలంగాణలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైద్యసిబ్బందికి కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం. వైద్య సిబ్బందికి ఎలాంటి హానీ కలుగకుండా చూసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు అమలవుతున్న మార్గదర్శకాలను మార్చివేసింది ప్రభుత్వం. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

ముఖ్యంగా కోవిడ్ బారిన పడి మరణించిన వారి విషయంలో పర్టిక్యూలర్ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారు. డెడ్ బాడీని తరలించే విషయంలోను, అంత్యక్రియలు జరిపే విషయంలోను మార్గదర్శకాలను మార్చారు. సెపరేట్ సింగిల్ రూమ్ కొవిడ్ మార్చురీలను ఏర్పాటు చేయాలని ఆసుప్రతుల ఇంఛార్జీలను ఆదేశించారు. డెడ్ బాడీని తరలించే సమయంలో ఒక్క అంబులెన్స్‌తో 6 పీపీఈ కిట్స్ పంపాలని నిర్దేశించారు. డ్రైవర్, హెల్పర్, నలుగురు కొవిడ్ డెడ్ బాడీ అటెండెంట్స్‌కు పీపీఈ కిట్స్ అందజేయాలని తెలిపారు.

ఫ్రీజర్ కొనడం కానీ…అద్దెకు తీసుకోవడం గానీ చేసేందుకు కొన్నింటిని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రతీ కోవిడ్ ఆసుపత్రిలో మొత్తం పేషెంట్స్‌లో పది శాతానికి తక్కువ కాకుండా బాడీ బ్యాగ్స్ అందుబాటులో వుంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. డెడ్ బాడీని తరలించిన తర్వాత ఆ ఫ్లోర్, కిటికీలు, వెంటిలెటర్లు, రూఫ్‌లకు సోడియం హైపొక్లోరైడ్ ద్రావణం కనీసం ఆరు సార్లు స్ప్రే చేయాలని ఆదేశించారు. వీటిని తీసుకెళ్లడం కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు.