బోట్లో ఉన్నది 73 మంది కాదు..77 మంది..మంత్రి క్లారిటీ!

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలోని బోటు ప్రమాద ఘటనలో ఇంకా 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని  మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. బోటులో తొలుత 73 మంది ఉన్నారని భావించినప్పటికీ, బాధితుల సమాచారం ప్రకారం 77 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనలో 26 మంది సురక్షితంగా బయటపడగా.. ఇప్పటి వరకు 35 మృతదేహాలను గుర్తించినట్లు మంత్రి వివరించారు. ఇవాళ ఉదయం కచ్చులూరు సమీపంలో బయటపడిన మహిళ మృతదేహాన్ని విశాఖకు చెందిన అరుణగా […]

బోట్లో ఉన్నది 73 మంది కాదు..77 మంది..మంత్రి క్లారిటీ!
Follow us

|

Updated on: Sep 20, 2019 | 3:29 PM

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలోని బోటు ప్రమాద ఘటనలో ఇంకా 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని  మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. బోటులో తొలుత 73 మంది ఉన్నారని భావించినప్పటికీ, బాధితుల సమాచారం ప్రకారం 77 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనలో 26 మంది సురక్షితంగా బయటపడగా.. ఇప్పటి వరకు 35 మృతదేహాలను గుర్తించినట్లు మంత్రి వివరించారు. ఇవాళ ఉదయం కచ్చులూరు సమీపంలో బయటపడిన మహిళ మృతదేహాన్ని విశాఖకు చెందిన అరుణగా గుర్తించామన్నారు. ఆచూకీ తెలియాల్సిన వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 9 మందికాగా.. మరో ఏడుగురు తెలంగాణ వారని మంత్రి తెలిపారు.

గోదావరిలో మునిగిన బోటు 250 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారని, దాని కిందే మిగిలిన మృతదేహాలు ఉండొచ్చని మంత్రి అంచనా వేశారు. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో బోటును బయటకు తీయడం కష్టంగా మారిందన్నారు. బోటులోనే మిగిలిన మృతదేహాలు ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు. బోటు ప్రమాదం ఘటనపై రెండు విచారణలు కొనసాగుతున్నాయన్నారు. బోటు ప్రమాదం సమయంలో 27 మందిని రక్షించిన గిరిజనులను మంత్రి అభినందించారు.

ఈనెల 15న పాపికొండల పర్యటనకు వెళ్లిన బోటు గోదావరిలో మునిగిపోయింది. కచ్చులూరు వద్ద పడవ నదిలో బోల్తా పడింది. ఆ సమయంలో 27 మంది ప్రయాణికులు ఎలాగో ప్రాణాలు కాపాడుకున్నారు. మిగిలిన మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఆరు రోజులుగా సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే,బోటుకు అనుమతి లేదనే వాదన కూడా ఉంది. పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ ఒత్తిడి వల్లే బోటును వదిలిపెట్టారని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తుంది.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..