AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీనియర్ నేతల చెక్..! రేవంత్ షాక్.. !!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు పీక్ లెవెల్ కు చేరుకుంటోంది. షార్ట్ కట్ లో దూసుకొచ్చి ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డికి టి.కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కరొక్కరే షాక్ ఇస్తున్నారు. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రకటించారు. దీనికి రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దానితో ఆగకుండా […]

సీనియర్ నేతల చెక్..! రేవంత్ షాక్.. !!
Rajesh Sharma
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Sep 20, 2019 | 1:25 PM

Share

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు పీక్ లెవెల్ కు చేరుకుంటోంది. షార్ట్ కట్ లో దూసుకొచ్చి ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డికి టి.కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కరొక్కరే షాక్ ఇస్తున్నారు. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రకటించారు. దీనికి రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దానితో ఆగకుండా హుజూర్ నగర్ నుంచి కిరణ్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించి దూకుడు ప్రదర్శించారు రేవంత్ రెడ్డి. ఉత్తమ్ రెడ్డి ఏకపక్షంగా తన సతీమణి పద్మావతికి టికెట్ ప్రకటించారంటూ రేవంత్ కాస్త ఘాటుగానే కామెంట్ చేశారు. రేవంత్ మాటలు నల్గొండ కాంగ్రెస్ నేతల్లో నిప్పు రాజేశాయి. గమ్మత్తేమిటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని చిరకాలంగా వ్యతిరేకిస్తున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. హుజూర్ నగర్ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడడం. నల్గొండ జిల్లా కాంగ్రెస్ విషయంలో రేవంత్ రెడ్డి జోక్యమేంటి అంటూ వెంకట్ రెడ్డి మంది పడ్డారు.

మరో వైపు రేవంత్ రెడ్డి అసెంబ్లీ కి వచ్చి సిఎల్ఫీ విద్యుత్ సమస్యని సభలో ప్రస్తావించడం లేదంటూ చేసిన కామెంట్ ఏకంగా క్రమశిక్షణా సంఘం దృష్టికి వెళ్ళింది. అసెంబ్లీకి వచ్చిన క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యాక్షలపై స్పందించారు. సభలూ ఎమ్మెల్యేలు బాగానే పోరాడుతున్నారు.. కానీ రేవంత్ రెడ్డి తన కామెంట్లతో పార్టీని, ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టాడని కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి కామెంట్లను సీరియస్ గా తీసుకున్నామని, ఈ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ లో చర్చించామని కోదండ రెడ్డి చెబుతున్నారు. అసెంబ్లీ లో మొదటి రెండు రోజులు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు మాట్లాడిన తీరు వల్ల పార్టీ గ్రాఫ్ పెంచుకుంటె మూడో రోజు రేవంత్ వచ్చి విద్యుత్ సమస్యపై మాట్లాడలేదని అని పార్టీ గ్రాఫ్ తగ్గించాడు. ఎప్పుడు ఎం మాట్లాడాలనేది సభ్యులు నిర్ణయించుకుంటారని, ఆ విషయంలో రేవంత్ జోక్యం అనవసరం అని కోదండరెడ్డి కాస్త ఘాటైన కామెంట్లే చేశారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ విషయంలోనూ రేవంత్ అతిగా స్పందిస్తున్నారని కోదండ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంపత్ కు సెల్ఫీ అవసరం లేదని, ఆయన పక్కనే చాలా మంది నిలబడి సెల్ఫీ తీసుకుంటారని, సంపత్ విషయంలో రేవంత్ మాట్లాడిన తీరు సరైంది కాదని అయన అన్నారు. యురేనియం విషయంలో వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్ లు ముందే ఏఐసీసీ కి రిపోర్ట్ ఇచ్చారని, జనసేన అఖిలపక్షానికి కి కాంగ్రెస్ నేతలు పోవడం తప్పేనని కోదండ రెడ్డి వ్యాఖ్యానించారు.

అంతటితో ఆగకుండా రేవంత్ రెడ్డి క్రమశిక్షణా రాహిత్యంపై పరిశీలన జరుపుతున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లు గళమెత్తుతున్నారు. సంపత్ విషయంలో రేవంత్ రెడ్డి కామెంట్స్ ని కూడా పరిశీలిస్తున్నామని కోదండ రెడ్డి చెప్పడం విశేషం. మరో వైపు జనసేన పార్టీ నిర్వహించిన అఖిల పక్ష భేటీ విషయం కూడా టి.కాంగ్రెస్ లో చిచ్చు రగులుతోంది. మొత్తానికి మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలంతా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు, అయన దూకుడుని తగ్గించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.. మరి రేవంత్ రెడ్డి వ్యూహమేంటో వేచి చూడాలి. రాహుల్ గాంధీ అండతో పార్టీలో ఉంటారా ? లేక బీజేపీ ఇస్తున్న బంపర్ ఆఫర్ తో జంప్ జిలానీగా మారతారా ? లెట్ అజ్ వెయిట్ అండ్ సీ !!