కేంద్ర మంత్రే కానీ ఢిల్లీ ఇల్లు లేదు.. ఎందుకో తెలుసా ?

కేంద్ర మంత్రే  కానీ ఢిల్లీ ఇల్లు లేదు.. ఎందుకో తెలుసా ?

ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడాయన.. కానీ లక్ కలిసొస్తే ఎలా ఉంటుందో చూపేందుకు ఆయనకు 6 నెలలే పట్టింది.. ఇంతలో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి.. సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసేందుకు సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయకు వయసు అడ్డొచ్చింది.. లక్ కిషన్ రెడ్డికి కల్సి వచ్చింది.. కట్ చేస్తే చకచకా ఎన్నికలు పూర్తవడం నరేంద్ర మోదీ హవాలో బంపర్ మెజారిటీతో ఎంపీగా గెల్చి హస్తినాపురికి వెళ్లడం అలా కమ్ అండ్ గో లాగా జరిగిపోయాయి.. అదృష్టం అంతటితో ఆగిందా అంటే […]

Rajesh Sharma

|

Sep 20, 2019 | 12:39 PM

ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడాయన.. కానీ లక్ కలిసొస్తే ఎలా ఉంటుందో చూపేందుకు ఆయనకు 6 నెలలే పట్టింది.. ఇంతలో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి.. సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసేందుకు సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయకు వయసు అడ్డొచ్చింది.. లక్ కిషన్ రెడ్డికి కల్సి వచ్చింది.. కట్ చేస్తే చకచకా ఎన్నికలు పూర్తవడం నరేంద్ర మోదీ హవాలో బంపర్ మెజారిటీతో ఎంపీగా గెల్చి హస్తినాపురికి వెళ్లడం అలా కమ్ అండ్ గో లాగా జరిగిపోయాయి.. అదృష్టం అంతటితో ఆగిందా అంటే ఆగలేదు.. తొలిసారి ఎంపీగా ఎన్నికవడమే తరువాయి.. మోదీ, అమిత్ షాల అండదండలతో కేంద్ర మంత్రిగా కూడా అయిపోయారు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. నవంబర్, 2018 లో ఘోరమైన ఓటమితో సిటీలో తిరిగేందుకు జంకిన వ్యక్తిని.. మే, 2019 చివరి నాటికి ఏకంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ లో దిగే స్థాయికి చేర్చింది ఖచ్చితంగా అదృష్టమే అంటే కాదనే వారే లేరు. అఫ్ కోర్స్… అయన సుదీర్ఘ కలం పార్టీకి చేసిన సేవ కూడా ఇందులో కీలకమే అనుకోండి.. అయితే కథ ఇక్కడితో ఆగలేదు..

కేంద్ర మంత్రి వర్గం లో చేరడం.. అమిత్ షాకు అనుబంధంగా కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆలా చకచకా జరిగిపోయాయి.. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది… కేంద్ర మంత్రి అవడం వరకు బాగానే ఉంది.. కానీ ఢిల్లీ లో ఈ మంత్రికి గారికి ఉండేందుకు ఇల్లే కరువైంది..నిజానికి కిషన్ రెడ్డికి తుగ్లక్ క్రెసెంట్ రోడ్ లో మినిస్టర్ బంగ్లాని కేటాయించారు. కానీ ఆ ఇంట్లో మాజీ కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ఉంటున్నారు. తనకు వేరే బంగ్లా కేటాయించాలని సిన్హా పట్టణాభివృద్ధి శాఖాధికారులను ఇది వరకే కోరారు. దాంతో సిన్హాకు బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదురుగా ఉన్న బిల్డింగ్ ను కేటాయించింది పట్టణాభివృద్ధికి శాఖా. కానీ ఆ ఇంట్లో బీజేపీ సీనియర్ నేత రాధామోహన్ సింగ్ ఉంటున్నారు. అటు రాధామోహన్ సింగ్ ఇల్లు ఖాళీ చేయరు.. ఇటు సిన్హా తన బంగ్లాని ఖాళీ చేసి రాధామోహన్ సింగ్ ఇంటికి మారరు. సో కిషన్ రెడ్డికి ఏపీ భావనే దిక్కైంది. అక్కడ్నించి అయన కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోంది. నిజానికి మే 25 న కొత్త లోక్ సభ ఏర్పాటైంది. జూన్ 25 నాటికి మాజీ లంతా క్వార్టర్స్ ఖాళీ చేయాల్సి ఉంది.. కానీ ఇది జరగకపోవడం తో కిషన్ రెడ్డి లాంటి వారు ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తోందని సమాచారం. ఖాళీ చేయని వారిలో కమల నాథులే ఎక్కువగా ఉండడంతో వారిపై ఒత్తిడి తేలేక.. పాపం కిషన్ రెడ్డి ఇలా సర్దుకుపోతున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.. ప్చ్.. పాపం కిషన్ రెడ్డికి ఈ అవస్థలు ఎన్నాళ్ళో ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu