గోదావరి అలర్ట్ : ధవళేశ్వరం వద్ద మొదటి హెచ్చరిక..

ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ప్రవాహంతో  గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గోదావరి నది ఉధృతి...

గోదావరి అలర్ట్ : ధవళేశ్వరం వద్ద మొదటి హెచ్చరిక..
Follow us

|

Updated on: Aug 15, 2020 | 5:51 PM

First Hazard Warning at Dhawaleswaram: ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ప్రవాహంతో  గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గోదావరి నది ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో 9.84 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు అధికం కావడంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వస్తున్న మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి  వదులుతున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.75 అడుగుల నీటిమట్టం నమోదు కావడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఎగువ నుంచి వస్తున్న గోదావరి వరద నీటిని సుమారు పది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే తూర్పు డెల్టా కాలువలకు 2,500 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు మూడు వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలావుంటే భద్రాచలం వద్ద 45.10 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది.

గోదావరి ఎగువ ప్రాంతంలోని కాలేశ్వరం వద్ద 9.17 మీటర్లు, పేరూరు వద్ద 11.70, దుమ్ముగూడెం వద్ద 12.52, భద్రాచలం వద్ద 45.10 అడుగులు, కూనవరం వద్ద 18.30 మీటర్లు, కుంట వద్ద 12.94 మీటర్లు, కొయిదా వద్ద 23.15మీటర్లు, పోలవరం వద్ద 12.94, రాజమహేంద్రవరం రైల్వే హేక్ బ్రిడ్జి వద్ద 16.23 మీటర్ల తో వరద గోదావరి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న గోదావరి ఉప నదుల నుంచి నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. లంక గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్