AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ విమానాశ్రయంలో 8 మంది మలేసియన్ల పట్టివేత

ఇండియా నుంచి మలేసియాకు పారిపోబోతున్న 8 మంది మలేసియన్లను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. వీరంతా ఇటీవల ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ ఈవెంట్ కు హాజరైనవారని తెలుస్తోంది.

ఢిల్లీ విమానాశ్రయంలో 8 మంది మలేసియన్ల పట్టివేత
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 05, 2020 | 7:14 PM

Share

ఇండియా నుంచి మలేసియాకు పారిపోబోతున్న 8 మంది మలేసియన్లను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. వీరంతా ఇటీవల ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ ఈవెంట్ కు హాజరైనవారని తెలుస్తోంది. మలేసియాకు చెందిన మలింబో ఎయిర్ వేస్ విమానం ఎక్కబోతూ ఈ వ్యక్తులు పట్టుబడ్డారు. ఢిల్లీ నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరు ఇంతకాలం దాక్కున్నారని, ఈ దేశం వదిలి తమ దేశానికి పారిపోయేందుకు పకడ్బందీ ప్లాన్ వేసుకుని ఆదివారం ఈ విమానాశ్రయానికి చేరుకున్నారని తెలుస్తోంది. పైగా అధికారులు అడిగిన ప్రశ్నలకు ఈ వ్యక్తులు సరైన సమాధానం కూడా ఇవ్వలేదట. ఈ ఎనిమిది మందిని ఎయిర్ పోర్టు అధికారులు పోలీసులకు అప్పగించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వీరిని విచారించనున్నారు. మలేసియా, ఇండోనేసియా సహా వివిధ దేశాలకు చెందిన సుమారు రెండు వేల మంది నిజాముద్దీన్ ప్రార్థనా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమాలతో లింకు ఉన్న కరోనా కన్ఫార్మ్ కేసులు 301 కి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా కేసులు పెరగడానికి నిజాముద్దీన్ ఈవెంట్ కి హాజరైనవారే కారకులని యూపీలో ఓ వ్యక్తి ఆరోపించగా అతడిని దుండగులు హత్య చేశారు.

Follow Us
మూడు తలుపులు.. ఒకటే సురక్షితం! మీరైతే ఏ డోర్ తెరుస్తారు?
మూడు తలుపులు.. ఒకటే సురక్షితం! మీరైతే ఏ డోర్ తెరుస్తారు?
చిట్టీ వేస్తున్నారా..? లాభపడాలంటే ఇలా చేయండి..
చిట్టీ వేస్తున్నారా..? లాభపడాలంటే ఇలా చేయండి..
వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ ఘటనపై CM దిగ్భ్రాంతి.. 9కి చేరిన మరణాలు
వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ ఘటనపై CM దిగ్భ్రాంతి.. 9కి చేరిన మరణాలు
ప్రేమలో మీ ఆకర్షణను పెంచే చాణక్యుడి అద్భుత సూత్రాలు ఇవే!
ప్రేమలో మీ ఆకర్షణను పెంచే చాణక్యుడి అద్భుత సూత్రాలు ఇవే!
వంటింటి మొండి మరకలను వదిలించే అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఇవే!
వంటింటి మొండి మరకలను వదిలించే అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఇవే!
చేతిలో అదనపు వేలు ఉంటే అదృష్టం కలిసొస్తుందా? ఆశ్చర్యపరిచే..
చేతిలో అదనపు వేలు ఉంటే అదృష్టం కలిసొస్తుందా? ఆశ్చర్యపరిచే..
జుట్టును ఒత్తుగా, నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు ఇవే!
జుట్టును ఒత్తుగా, నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు ఇవే!
రమ్యకృష్ణను కృష్ణవంశి ప్రేమలో పడేలా చేసిన సూపర్ హిట్ సాంగ్
రమ్యకృష్ణను కృష్ణవంశి ప్రేమలో పడేలా చేసిన సూపర్ హిట్ సాంగ్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. APలో బడులకు వేసవి సెలవులు పొడిగింపు?
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. APలో బడులకు వేసవి సెలవులు పొడిగింపు?
ఓరయ్యా ఇదేం ఆట రా బాబు.. ఆఫ్ఘన్ బ్యాటర్‌ పై సిరాజ్ ఫైర్
ఓరయ్యా ఇదేం ఆట రా బాబు.. ఆఫ్ఘన్ బ్యాటర్‌ పై సిరాజ్ ఫైర్