ఢిల్లీలో లక్షా ఇరవై వేలకు చేరువలో కరోనా కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా ఇరవై వేలకు చేరువలోకి చేరుకుంది. ఢిల్లీ సర్కార్ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో అత్యధికంగా 1,652 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 58 మంది మృతిచెందారు.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా ఇరవై వేలకు చేరువలోకి చేరుకుంది. ఢిల్లీ సర్కార్ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో అత్యధికంగా 1,652 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 58 మంది మృతిచెందారు.. దీంతో.. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,645 కు చేరుకోగా.. మృతుల సంఖ్య 3,545కు పెరిగింది.. మరోవైపు గడచిన 24 గంటలలో 1,994 మంది డిశ్చార్జ్ అయ్యారు.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారు 97,693 మంది కాగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 17,407 గా ఉన్నాయి.




