AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరొకరి భర్తతో ఒకే రూంలో మహిళా పోలీస్ క్వారంటైన్

అవివాహిత మహిళ.. అధికారులకు అద్దె మొగుడిని పరిచయం చేసింది. ఇద్దరు కలిసి ఒకే రూంలో అధికారిక క్వారంటైన్ లోకి వెళ్లారు. తీరా, అసలు భార్య భర్త కోసం వెతుకుతుండడంతో బండారం బయటపడింది. మ‌హారాష్ర్టలో ఓ మహిళ పోలీసు రంకు భాగోతం వెలుగులోకి వచ్చింది.

మరొకరి భర్తతో ఒకే రూంలో మహిళా పోలీస్ క్వారంటైన్
Balaraju Goud
|

Updated on: Jul 16, 2020 | 8:49 PM

Share

అవివాహిత మహిళ.. అధికారులకు అద్దె మొగుడిని పరిచయం చేసింది. ఇద్దరు కలిసి ఒకే రూంలో అధికారిక క్వారంటైన్ లోకి వెళ్లారు. తీరా, అసలు భార్య భర్త కోసం వెతుకుతుండడంతో బండారం బయటపడింది. మ‌హారాష్ర్టలో ఓ మహిళ పోలీసు రంకు భాగోతం వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో నాగ్‌పూర్‌లోని కొందరు పోలీసులు వైరస్ సోకింది. త‌న తోటి పోలీస్ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో అవివాహిత మ‌హిళా పోలీస్ కానిస్టేబుల్ ను అధికారులు క్వారంటైన్ కు త‌ర‌లించారు. ఆమెతో ప్రైమ‌రీ కాంటాక్ట్ అయినవారి గురించి ఆరా తీయగా, తన ప్రియుడిని భ‌ర్త‌గా పేర్కొంటూ అధికారుల‌కు వివ‌రాలు అందించింది. దీంతో అధికారులు ఇద్దరిని క‌లిపి పోలీస్ ట్రైనింగ్ సెంట‌ర్‌లోని క్వారంటైన్ కు త‌ర‌లించారు. అంతా బాగానే సాగుతుండ‌గా క‌థ మ‌లుపు తిరిగింది.

ఇదిలావుంటే, తన భ‌ర్త మూడు రోజులైనా ఇంటికి రాక‌పోవడంతో నాగ్‌పూర్‌కు చెందిన ఓ వివాహిత వెతుక్కుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికులు అందించిన సమాచారంతో ఆమె భ‌ర్త వేరే మ‌హిళ‌తో క‌లిసి క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుసుకుంది. అతన్ని క‌లిసేందుకు పీటీసీకి వెళ్ల‌ిన మహిళను అక్క‌డి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన భర్తపై బజాజ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచార‌ణ చేపట్టిన పోలీసులు స‌ద‌రు వ్య‌క్తిని మ‌రొక క్వారంటైన్ కేంద్రానికి త‌ర‌లించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులను తప్పుదారి పట్టించిన సదరు మహిళ కానిస్టేబుల్ పై శాఖాపరమైన చర్యలకు అదేశించారు పోలీసులు కమిషనర్.

Follow Us
చెమట వాసనకు చెక్! ఇంట్లోనే మల్లె పూలతో మతిపోగొట్టే అత్తరు తయారీ
చెమట వాసనకు చెక్! ఇంట్లోనే మల్లె పూలతో మతిపోగొట్టే అత్తరు తయారీ
వేయి వెలుగుల తీరనగరం.. భవిష్యత్తాంధ్రకు మణిహారం
వేయి వెలుగుల తీరనగరం.. భవిష్యత్తాంధ్రకు మణిహారం
Video: 6,6,6,6,6,4,4,4.. 16 బంతుల్లో పంజాబ్ ఇజ్జత్ తీసిన వైభవ్
Video: 6,6,6,6,6,4,4,4.. 16 బంతుల్లో పంజాబ్ ఇజ్జత్ తీసిన వైభవ్
వేస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పారేసే తొక్కలు చేసే..
వేస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పారేసే తొక్కలు చేసే..
ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
వేసవిలో మీ కరివేపాకు మొక్క ఎండిపోతోందా? గుబురుగా పెరగాలంటే ఇలా
వేసవిలో మీ కరివేపాకు మొక్క ఎండిపోతోందా? గుబురుగా పెరగాలంటే ఇలా
నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!
నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!
వేసవిలో మీ తోట పచ్చగా ఉండాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు మీ కోసమే!
వేసవిలో మీ తోట పచ్చగా ఉండాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు మీ కోసమే!
మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?
మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?
కోడిలోని ఈ భాగాలు యమ డేంజర్.. తింటే ఆస్పత్రికెళ్లడం పక్కా..
కోడిలోని ఈ భాగాలు యమ డేంజర్.. తింటే ఆస్పత్రికెళ్లడం పక్కా..