Breaking News: కాబూల్‌లో బాంబ్ బ్లాస్ట్

ఓవైపు ప్రభుత్వం తాలిబన్లతో ఉన్నత స్థాయి శాంతి చర్చలు జరుపుతుండగా.. అఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో వరుస పేలుళ్ళకు పాల్పడుతున్నారు. తాజాగా దేశ రాజధాని కాబూల్‌లో బాంబ్ బ్లాస్ చేశారు.

Breaking News: కాబూల్‌లో బాంబ్ బ్లాస్ట్

Updated on: Oct 27, 2020 | 5:59 PM

Bomb blast in Kabool city: అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరంలో బాంబ్ బ్లాస్టయ్యింది. మాగ్నటిక్ ఐఈడీ కలగలిపిన బాంబు పేలిన దుర్ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పదిమందికి పైగా గాయపడ్డారు.

కాబూల్ నగరంలోని డౌన్‌టౌన్ చార్ ఖలా ఏరియాలో మాగ్నటిక్ ఐఈడీ కలగలిపిన మైన్‌ను తీవ్రవాదులు పేల్చివేశారు. టయోటా కరోలా మోడల్ కారులో ఈ మైన్‌ను బిగించి, పేల్చివేతకు పాల్పడ్డారు. బాంబు పేలుగులో ముగ్గురు పౌరులు మరణించారు. పదిమందికి పైగా గాయపడ్డారు.

అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లతో ప్రభుత్వం శాంతి చర్చలు కొనసాగిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు పెరిగిపోయాయి. ఉన్నత స్థాయిలో జరుగుతున్న శాంతి చర్చలకు విఘాతం కలిగించేందుకు కొన్ని తీవ్రవాద సంస్థలే ఈ హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని భావిస్తున్నారు.

ఇదిలా వుండగా.. అఫ్ఘన్ న్యూస్ ఏజెన్సీ టోలో న్యూస్ కథనం ప్రకారం దేశంలో పౌరులపై తీవ్రవాద దాడులు 30 శాతం తగ్గాయి. 2019తో పోల్చుకుంటే 2020 తొలి తొమ్మిది నెలల్లో పౌరులపై దాడులు తగ్గాయని యూఎన్ మిషన్ టు అఫ్ఘనిస్తాన్ (ఉనామా) నివేదిక చెబుతోందని టోలో న్యూస్ పేర్కొంది.

Also read: సెకెండ్‌వేవ్ కరోనా మరింత డేంజర్.. వైద్యవర్గాల వార్నింగ్

Also read: ఇండియా, అమెరికా ‘బెకా‘ డీల్… హైలైట్స్ ఇవే

Also read: తెలంగాణకు రెండు భారీ పెట్టుబడులు

Also read: వికారాబాద్ అడవుల్లో కాల్పుల కలకలం

Also read: ధోనీ అభిమానులకు శుభవార్త.. సీఎస్కే కీలక ప్రకటన

Follow Us