AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు; చచ్చేదాకా బీజేపీలోనే వుంటానన్న రఘునందన్ రావు.. కేసీఆర్ గురువేనని పునరుద్ఘాటన

బీజేపీ తరపున దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన మాధవనేని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలో జర్నలిస్టు అసోసియేషన్ నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో పాల్గొన్న రఘునందన్ రావు..

బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు; చచ్చేదాకా బీజేపీలోనే వుంటానన్న రఘునందన్ రావు.. కేసీఆర్ గురువేనని పునరుద్ఘాటన
Rajesh Sharma
|

Updated on: Nov 16, 2020 | 7:08 PM

Share

BJP MLA sensational comments: బీజేపీ తరపున దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన మాధవనేని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలో జర్నలిస్టు అసోసియేషన్ నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో పాల్గొన్న రఘునందన్ రావు తనకు బీజేపీతో వున్న అనుబంధంపైనా, గ్రేటర్ ఎన్నికలపైనా, టీఆర్ఎస్-ఎంఐఎం స్నేహంపైనా, కేసీఆర్‌తో తనకున్న గురుశిష్య బంధంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీట్ ద ప్రెస్‌లో పాల్గొన్న రఘునందన్ రావు.. ఎంఐఎంను మేయర్ పీఠంపై కూర్చోబెట్టడానికి టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ‘‘ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే.. ఎంఐఎం పార్టీకి ఓటు వేసినట్లే.. హైదరాబాద్ నగరాన్ని బెంగాల్, కోల్‌కతాగా మార్చే అవకాశం టీఆర్ఎస్-ఎంఐఎంకు ఇవ్వ వద్దని హైదరాబాదు ఓటర్లకు విజ్ఞప్తి .. పాతబస్తీలో జరుగుతోన్న అసాంఘిక కార్యక్రమాలను బయటకు తీస్తాం.. ’’ అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.

‘‘ బీజేపీ లక్ష్యం బావ, బావమరిది కాదు.. మా లక్ష్యాన్ని చేరుకోవటమే బీజేపీకి ముఖ్యం.. గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కోవడానికి బీజేపీ దగ్గర ప్రత్యేక ప్రణాళికలున్నాయి.. వరద సాయాన్ని టీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుగా మార్చింది.. జోనల్ కమిషనర్‌కు 2లక్షల కంటే ఎక్కువ డబ్బులు డ్రా చేసే అధికారం లేదు.. గ్రేటర్ ఎన్నికల తర్వాత 2లక్షల కంటే ఎక్కువ డ్రా చేసిన జోనల్ కమిషనర్లను కోర్టుకు ఈడ్చుతాం.. ’’ అని రఘునందన్ రావు అన్నారు.

‘‘ బీజేపీ జాతీయ నాయకత్వం గ్రేటర్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది.. టీఆర్ఎస్ పార్టీలో అవమానాలు ఎదుర్కొంటోన్న అసలు సిసలైన ఉద్యమకారులను బీజేపీ గౌరవిస్తోంది.. టీఆర్ఎస్ పార్టీని ఓడించ వచ్చన్న స్పూర్తిని దుబ్బాక ఇచ్చింది.. బీజేపీని.. రఘునందనరావును వేరుచేసి చూడవద్దని మనవి.. చచ్చేదాకా బీజేపీని వీడేది లేదు’’ అని దుబ్బాక ఎమ్మెల్యే అంటున్నారు.

‘‘ సిద్ధిపేటతో సమానంగా దుబ్బాకకు నిధులు తీసుకెళ్తాను .. గ్రామీణ ప్రాంతం కాబట్టే కేంద్ర నిధులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తాను .. ఇకపై ప్రతి ఎన్నికను గెలుస్తూనే ఉండేలా దుబ్బాకను అభివృద్ధి చేస్తాను .. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం కోర్టులో స్వయంగా పోరాటం చేస్తాను .. దుబ్బాక బస్టాండ్ నిధుల గోల్ మాల్ వ్యవహారం త్వరలోనే బయట పడుతుంది..’’ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కొన్ని ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు.

ALSO READ: అభివృద్ధి పనులకు ఎన్నికల కమిషన్ అనుమతి

ALSO READ: నడిరోడ్డుపై రివాల్వర్‌తో వీరంగం

ALSO READ: సామాజిక సేవ పేరుతో మోసం.. 3 కోట్ల మేరకు..