ఇక ఆన్‌లైన్‌లోనే ఉల్లి..! అప్లై చేయండి..

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు..కానీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం ఉల్లి పెడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావంటున్నారు కోనసీమవాసులు. ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిని పంపిణీ చేసేందుకు పెడుతున్న కండీషన్లు చూస్తే మీరు కూడా అది నిజమేనంటారు. వివరాల్లోకి వెళితే.. కిలో ఉల్లిపాయలు రూ. 25 మాత్రమే. ఇది ఏపీ ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ప్రజలకు అందిస్తున్న ఉల్లి ధరలు. మొన్నటి వరకు సబ్సిడీ ఉల్లి కావాలంటే..రేషన్‌ కార్డు తప్పనిసరిగా పెట్టారు. దీంతో లబ్ధిదారులు పెద్ద […]

ఇక ఆన్‌లైన్‌లోనే ఉల్లి..! అప్లై చేయండి..
Follow us

|

Updated on: Dec 11, 2019 | 7:42 PM

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు..కానీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం ఉల్లి పెడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావంటున్నారు కోనసీమవాసులు. ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిని పంపిణీ చేసేందుకు పెడుతున్న కండీషన్లు చూస్తే మీరు కూడా అది నిజమేనంటారు. వివరాల్లోకి వెళితే.. కిలో ఉల్లిపాయలు రూ. 25 మాత్రమే. ఇది ఏపీ ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ప్రజలకు అందిస్తున్న ఉల్లి ధరలు. మొన్నటి వరకు సబ్సిడీ ఉల్లి కావాలంటే..రేషన్‌ కార్డు తప్పనిసరిగా పెట్టారు. దీంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉల్లిని కొనుగోలు చేశారు. కానీ, చాలాచోట్ల ప్రజలకు సరిపడినంతగా అధికారులు అందించలేకపోయారు. అంతేకాదు, పలుచోట్ల ఉల్లికోసం క్యూ కట్టిన ప్రజలు అవస్థలు పడ్డారు. అనేక ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, కొన్ని ఏరియాల్లో ఒకే ఫ్యామిలీ నుండి ఒకరికి మించి ఉల్లిని తీసుకుంటున్నారని అధికారులు చెప్పుకొచ్చారు. దాంతో కొనుగోలు చేసిన కుటుంబీకుల చేతికి సిరా మార్కు వేసి, ఒక ఇంటికి ఒకసారి మాత్రమే ఉల్లిని పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. అది కూడా ఫెయిల్‌ అయ్యామని గ్రహించిన అధికారులు తాజాగా మరో నిబంధన అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగా ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలు నమోదు చేసుకున్నాకే ఉల్లిని అందజేయాలనే కండీషన్‌ పెట్టారు. ఆధార్‌, రేషన్‌కార్డు, మొబైల్‌ నెంబర్‌ ఇచ్చిన తరువాతే కిలో ఉల్లి. లేదంటే వాళ్లు ఖాళీ సంచితో వెళ్లాల్సిందే. దీంతో అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఒకప్పుడు ఎన్నికల సమయంలో చేతికి సిరా చుక్క వేస్తే..ఇప్పుడు ఉల్లిపాయల కోసం వేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇవాళ ఆన్‌లైన్‌, రేపు వేలిముద్రలు, ఫోటోలు కూడా తీసుకుంటారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల కష్టాలను గమనించి తగిన పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.

Latest Articles
మూడో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
మూడో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
దినేష్ కార్తీక్ ఎదుట తల వంచిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో
దినేష్ కార్తీక్ ఎదుట తల వంచిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో
మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా? ఈ నియమాలు తెలుసా?
మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా? ఈ నియమాలు తెలుసా?
పుచ్చకాయ గింజల్లో అంతుందా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అవాక్కే!
పుచ్చకాయ గింజల్లో అంతుందా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అవాక్కే!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..