చైనా బ్రాండ్ ఫోన్ ప్ర‌చారానికి గుడ్ బై చెప్పిన యంగ్ హీరో..?

| Edited By:

Jul 10, 2020 | 1:51 PM

బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్య‌న్ చైనాకు చెందిన టాప్ బ్రాండ్ ఒప్పో మొబైల్స్‌కి‌ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆ బ్రాండ్‌తో ఒప్పందాన్ని కార్తిక్ వ‌దులుకున్న‌ట్లు.. సోషల్ మీడియాలో ప‌లు వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌లే గాల్వాన్ లోయ‌లో భార‌త్-చైనాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ..

చైనా బ్రాండ్ ఫోన్ ప్ర‌చారానికి గుడ్ బై చెప్పిన యంగ్ హీరో..?
Follow us on

బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్య‌న్ చైనాకు చెందిన టాప్ బ్రాండ్ ఒప్పో మొబైల్స్‌కి‌ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆ బ్రాండ్‌తో ఒప్పందాన్ని కార్తిక్ వ‌దులుకున్న‌ట్లు.. సోషల్ మీడియాలో ప‌లు వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌లే గాల్వాన్ లోయ‌లో భార‌త్-చైనాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ర్ష‌ణ‌లో భార‌త్‌కు చెందిన 20 మంది జ‌వాన్లు క‌న్నుమూశారు. ఈ విష‌యంపై సీరియ‌స్ అయిన భార‌త్‌.. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ని బ్యాన్ చేసింది. అలాగే ప్లే స్టోర్ నుంచి కూడా తొల‌గించిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే చైనా వ‌స్తువుల‌కు ప్రచారం చేయ‌వ‌ద్ద‌ని కోరుతూ ఆల్ ఇండియా ట్రేడ‌ర్స్ స‌మాఖ్య గ‌త నెల‌లోనే సినీ ప్ర‌ముఖుల‌కు లేఖ రాసింది. దీంతో కార్తిక్ ఆర్య‌న్ ఒప్పో ఫోన్స్‌కి ప్రచారం నిర్వ‌హించ‌డం ఆపేశాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల కార్తిక్ త‌న ఇంట్లో కిటీకీ ద‌గ్గ‌ర నిల‌బ‌డి మేఘాల‌ను త‌న మొబైల్‌లో ఫొటో తీస్తున్న చిత్రం ఒక‌టి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే కార్తిక్ ప‌ట్టుకున్న ఫోన్ ఐ ఫోన్ అవ‌డంతో నెటిజ‌న్లు, ఫ్యాన్స్ చైనా ఫోన్‌కి ప్ర‌చారాన్ని వ‌దిలేశాడ‌ని.. అత‌ని ఫొటో ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.

సాధార‌ణంగా.. ఒక‌రు ఒక బ్రాండ్‌కి అంబాసిడ‌ర్‌గా ఉన్న‌ప్పుడు మ‌రో బ్రాండ్‌కు సంబంధించిన వాటిని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌కూడ‌దు. ఒక‌వేళ‌ అలా చేస్తే న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంది. ఈ విష‌యం తెలిసి కూడా కార్తిక్ వేరే ఫోన్ ప‌ట్టుకుని ఫొటోలు తీయ‌డం, అది కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో.. చైనాతో ఒప్పందం ర‌ద్దు చేసుకున్నాడ‌ని తెలుస్తోంది. కాగా దీనిపై యంగ్ హీరో కార్తిక్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Read More:

బ్రేకింగ్: అతి పెద్ద సోలార్ విద్యుత్తు ప్లాంటును జాతికి అంకితం చేసిన మోదీ

డ్వాక్రా మ‌హిళ‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ శుభ‌వార్త‌..

Gold rate@51K. రాబోతున్న శ్రావణ మాసం ఎఫెక్ట్‌తో ఇంకా పెరుగుతుందా!