విశాఖలో ఏసీబీకి చిక్కిన అవినీతి చేపలు..!
విశాఖలో మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలలో పడ్డారు. ఏకంగా లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జీవీఎంసీ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ హరగోపాల్, ట్యాక్స్ కలెక్టర్ మహేష్.. ఎంవీపీ కాలనీలోని ఓ భవనానికి ట్యాక్స్ పొడిగించకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడానికి నిరాకరించిన బాధితుడు ఏపీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ డీఎస్పీ రంగరాజు నేతృత్వంలో దాడులు చేసి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.